సాంకేతిక ఆధారంగా నేరాలపై నిఘా...జిల్లా పోలీసు శాఖకు కేటాయించనున్న డ్రోన్ పనితీరును పరిశీలన..విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

VS9TV న్యూస్, కర్నూలు క్రైం :

సాంకేతిక ఆధారంగా నేరాల కట్టడిపై దృష్టి పెట్టామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ఈ సంధర్బంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ డిజిపి కార్యాలయం నుండి కర్నూలు జిల్లా పోలీసు శాఖకు కేటాయించనున్న డ్రోన్ కెమెరా పనితీరును కర్నూలు ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ లో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని స్మార్ట్ పోలీసింగ్ తో నేరాలను నియంత్రించడానికి డ్రోన్ సాంకేతికతను ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
డ్రోన్ కెమెరా వివరాలు :

ఈ డ్రోన్ కెమెరా చెన్నై మార్స్ ( MARS) ఎయిరో( ఓపిసి) ప్రవేట్ లిమిటెడ్ కు చెందింది.శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ,విపత్తు నిర్వహణ, వివిధ బందోబస్తులు,బహిరంగ సభలు, జాతరలు/ఊరేగింపు సమయంలో జన సమూహాన్ని పర్యవేక్షించడం,క్రౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అవాంఛనీయ సంఘటనలు నిలువరించుట, సెన్సిటివ్/హాట్స్పాట్ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించుటకు,వరదలు,భూకంపాల వంటి విపత్తు సమయాలలో రెస్క్యూ & సహాయక చర్యలు చేపట్టుట, అనుమానితులను గుర్తించడం జరుగుతుందన్నారు.
ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు,పండుగలు, ఉత్సవాలు,కర్ఫ్యూలు,అత్యవసర సమయాలలో ఐదు కిలోమీటర్ల వరకు ఈ డ్రోన్ ప్రయాణించగలదు.నాటుసారా తయారీ, పేకాట స్థావరాలు,బహిరంగ/పబ్లిక్ ప్రదేశాల్లో అనుమానితులు,నగర శివారులలో చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై, రాత్రి సమయాలలో వాహనాల నెంబర్లను కూడా నైట్ విజన్ కెమెరాతో పర్యవేక్షిస్తుంది.వరదలు, రెస్య్కూ సమయాలలో పే లోడ్ టెక్నాలజీతో బాధితులకు సహాయం అందించడానికి ఐదు కేజిల ఫుడ్,మెడికల్ వస్తువులు గానీ తీసుకెళ్ళగలదు.ఈ కార్యక్రమంలో ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ డిస్పీ రమణ,స్పెషల్ బ్రాంచ్ సిఐ తేజమూర్తి,కర్నూలు నాల్గవ పట్టణ సిఐ మధుసుధన్ గౌడ్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...