యూనివర్శిటి ఖ్యాతిని పెంపొందించడంలో విద్యార్థులే ప్రథానపాత్ర పోషించాలి... వి.వెంకట బసవరావు,విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య..

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

రాయలసీమ యూనివర్శిటి ఖ్యాతిని పెంపొందించడంలో విద్యార్థులే ప్రథానపాత్ర పోషించాలని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు.బుధవారం యూనివర్శిటి ఇంజినీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెమినార్ 2025 (TECH VUDBHAV - 2K25) కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతికరంగాల్లో కొనసాగుతున్న పరిశోధనలు,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన నూతన ఆవిష్కరణలపట్ల ఇంజినీరింగ్ విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు.తాము చదువుతున్న విభాగాల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రాజెక్టు వర్కులు పూర్తిచేసినపుడే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.కేవలం తరగతిగదికే పరిమితం కాకుండా లైబ్రరీతోపాటు,ఇంటర్నెట్లో అందుబాటులోఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ దిశగా యూనివర్శిటిలోని వసతులను సద్వినియోగం చేసుకుంటూ, విద్యార్థులంతా జీవితంలో పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.వర్శిటి ఇంజినీరింగ్ కాలేజీలో వసతుల మెరుగుదలకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.విద్యార్థుల జీవితానికి మేలి మలుపుగా నిలిచే ఇంజినీరింగ్ విద్యను ఏమాత్రం అలక్ష్యం చేయవద్దని ఆచార్య బసవరావు హితవు పలికారు. యూనివర్శిటి రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడంవల్ల అది వారి భవిష్యత్తుకు ఎంతగానో సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు.అనంతరం పేపర్ ప్రెజెంటేషన్,పోస్టర్ ప్రెజెంటేషన్ మొదలైన కార్యక్రమాలను వి.సి.ఆచార్య బసవరావు, రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడు పరిశీలించి విద్యార్థులను,అధ్యాపకులను అభినందించారు.కార్యక్రమాన్ని రేపు కూడా ఇదేస్ఫూర్తితో కొనసాగించాల్సిందిగా వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనివర్శిటి విద్యార్థిని,విద్యార్థులు అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...