రంజాన్ పురస్కరించుకొని హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో ప్రత్యేక ప్రార్ధనలు...

VS9TV న్యూస్,కల్లూరు :

కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,35వ వార్డ్,హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో రంజాన్ పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు.ప్రార్థనలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత పెద్దలు మౌలానా అబ్దుల్ సత్తార్,హజరత్ మౌలానా ఇస్మాయిల్,అబ్దుల్ హాక్,మస్జీద్ కమిటీ ప్రెసిడెంట్,సెక్రటరీలు ఖాసీం మియా,మొల్ల హుసేన్ సాహెబ్,హాజరై ప్రార్థనలు చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రంజాన్ సందర్బంగా కర్నూలు,పాణ్యం ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు. హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ ను జిల్లాలో అతిపెద్ద మస్జీద్ గా నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.నిర్మాణం ప్రారంభం నుండి మస్జీద్ లో బక్రీద్, రంజాన్ వంటి పండుగలు సందర్బంగా ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతున్నట్లు చెప్పారు.మస్జీద్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. అదేవిదంగా ముస్లిం సమాజం సైతం మస్జీద్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అబ్దుల్ షుకూర్,అబ్దుల్ హమీద్,ఖాజామియ, మహబూబ్ బాషా,నూర్ అహమ్మద్, మహమ్మద్ సోహైల్,చుట్టుపక్కల ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...