అనధికారికంగా ప్రభుత్వ సైరన్,ఇతర స్టిక్కర్ లు ఉపయోగిస్తే కఠినచర్యలు... రవిచంద్ర,జంగారెడ్డిగూడెం డీఎస్పీ...

అనధికారికంగా ప్రభుత్వ సైరన్,ఇతర స్టిక్కర్ లు ఉపయోగిస్తే కఠినచర్యలు

రవిచంద్ర,జంగారెడ్డిగూడెం డీఎస్పీ

VS9TV న్యూస్,ఏలూరు క్రైం :

అనధికారికంగా ప్రభుత్వ సైరన్,ఇతర స్టిక్కర్ లు ఉపయోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు.ఈ మేరకు సిఎంఒ స్టిక్కర్స్ వేసుకొని హల్ చల్ చేసిన ఉరకరణం జగన్నాథరావును తడికలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సిఎంఒ స్టిక్కర్స్ పై డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.విచారణలో సిఎంఒ 
స్టిక్కర్ నకిలీది కావడంతో జగన్నాథరావు ను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్బంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ఎవరైనా అనధికారికంగా సైరన్,ప్రభుత్వానికి చెందిన ఇతర గుర్తింపు స్టిక్కర్లని వేసుకొని తిరిగితే ఎంతటి వారైనా సరే సహించేది లేదన్నారు.ఇప్పటికే పలు కేసుల్లో ఉరకరణం జగన్ నిందితుడుగా ఉన్నట్లు చెప్పారు.కామవరపుకోటలో ఒక స్కూల్ అనుమతుల కోసం రూ.5లక్షలు డిమాండ్ చేశాడన్నారు.నగదు ఇవ్వకపోతే స్కూల్ పై ఫిర్యాదు చేసి ముసివేస్తానని బెదిరింపులకు దిగినట్లు పేర్కొన్నారు.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు జగన్ ను అరెస్ట్ చేసి చింతలపూడి కోర్టులో హాజరు పరచిన అనంతరం రిమాండ్ కి తరలించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...