సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణ...ఆధునిక సాంకేతికతతో నేరస్ధులపై నిఘా ఉంచాలి...పోలీసు అధికారులతో సమీక్ష...జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణ

ఆధునిక సాంకేతికతతో నేరస్ధులపై నిఘా ఉంచాలి

పోలీసు అధికారులతో సమీక్ష

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి,నేరాల నియంత్రణతో పాటు నేరస్ధులను పట్టుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు,ఎస్సైలతో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్న సిఐడి ఐజి వీనిత్ బ్రిజ్ లాల్ తో జిల్లా ఎస్పీ చర్చించారు. సిఐడి ఐజి సిసిటిఎన్ఎస్ గురించి జిల్లా ఎస్పీతో వివరాలు అడిగితెలుసుకున్నారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో మాట్లాడుతూ కర్నూలు,పత్తికొండ, ఆదోని,ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసుల గురించి జిల్లా ఎస్పీ సమీక్షించి ఆరా తీశారు.పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు, సూచనలు చేశారు.కేసు నమోదు నుంచి అభియోగ పత్రాలు దాఖలు వరకు ప్రతి అంశాన్నీ సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌లో నమోదు చేయాలన్నారు.
పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సిసిటిఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపర్చాలన్నారు. అన్ని వివరాలు నమోదు చేయడం వల్ల కేసులు,వ్యక్తుల పూర్తి సమాచారం తెలుస్తుందని అది అందరికీ ఉపయోగపడేలా దోహదపడుతుందని చెప్పారు.ప్రతి పోలీస్‌ స్టేషన్‌ సిడి పైళ్ళను ఆయా పోలీసు అధికారులు సిసిటిఎన్‌ఎస్‌ లో నమోదు చేసారో లేదా అని ఆరా తీశారు. సీసీటీఎన్‌ఎస్‌లో ముఖ్యంగా గ్రేవ్‌ కేసులు, నాన్‌ గ్రేవ్‌ కేసులలో పార్ట్‌ 1,పార్ట్‌ 2సీడీలు అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు.మర్డర్‌ కేసుల్లో,174 సిఆర్‌పిసి కేసుల్లో త్వరితగతిన పురోగతి పొందేలా చూసుకుంటూ అభియోగ పత్రాలను వీలైనంత తొందరగా కోర్టులో ధాఖలు చేయాలన్నారు.డిఎస్పీ స్ధాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.క్రైమ్ రికార్డు సిడి ఫైల్స్ తయారు చేయడంలో సిసి టిఎన్ ఎస్ లో వివరాలు నమోదు అప్ డేట్ చేయడంలో ఎలాంటి లోపాలు ఉన్నాయో తెలియజేశారు.ఎమి చేయాలి,ఎమి చేయకూడదనే విషయాలను తెలియజేశారు. పోలీసుస్టేషన్ లలో పని చేసే సిసిటిఎన్ ఎస్ పోలీసు సిబ్బందితో మాట్లాడారు.గ్రేవ్ కేసులు,యుఐ కేసులు,మర్డర్,సైబర్ నేరాల కేసులు,పోక్సో కేసులు,మిస్సింగ్ కేసులు,ఎస్సీ ఎస్టీ కేసులు,డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు.రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.డ్రంకెన్ డ్రైవ్,ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసుస్టేషన్ల పరిధులలో తనిఖీలు నిర్వహించాలన్నారు.సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఎస్పీ తెలిపారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి.హుస్సేన్ పీరా,ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్,డిఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి,ఉపేంద్రబాబు,హేమలత, భాస్కర్ రావు,ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సిఐలు,ఎస్సైలు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...