న్యాయపరమైన చిక్కులను తొలగించి వెంటనే పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి...

ఇది మాటల ప్రభుత్వము చేతల ప్రభుత్వం కాదు నిరుద్యోగులను వంచిస్తుంది...

నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం...

డివైఎఫ్ఐ...
 
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసి రెండున్నర సంవత్సరమైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వెంటనే న్యాయపరమైన చిక్కులను తొలగించి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని పాత పద్ధతిలోనే హోంగార్డుల రిజర్వేషన్ ని కొనసాగించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ కి ర్యాలీ నిర్వహించారు.అనంతరం నిరుద్యోగులతో కలిసి జాయింట్ కలెక్టర్ బి.నవ్యకు వినతి పత్రం అందించారు.
ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్లా,పోలీస్ కానిస్టేబుల్ నిరుద్యోగ నాయకులు బాబు నాయక్ నాగార్జున మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులను తొలగించి వెంటనే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలన్నారు.21/2 సం నుండి పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ ను వెంటనే పూర్తి చేయాలన్నారు.నారా లోకేష్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ను 6నెలలో పూర్తి చేస్తాం అన్నారు ఇప్పుడు 9నెలలు అయ్యింది ఇచ్చిన హామీ ని వెంటనే నెరవేర్చాలన్నారు. సిఎం మనది మంచి ప్రభుత్వం అన్నారు మరి మాకు న్యాయం ఎక్కడ..మా బ్రతుకులు రోడ్డున పడ్డాయి బాగుచేసే దిక్కు ఎక్కడ..?సిబిఎన్ మా కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాలు చితికి పోతున్నయి ఆదుకోండి అని ప్లాకార్ట్స్ చేత పూని ఎర్రటి ఎండలో నినాదాలు ఇస్తూ ఇంతమంది నిరుద్యోగులు రోడ్డుపై కి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క మాటను అమలు చేయకుండా వంచిస్తుందని ఆరోపించారు.నారా లోకేష్ ఎన్నికల ముందు అధికారంలోకొస్తే ఆరు నెలల లోపు నోటిఫికేషన్ ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.9నెలలైనా ఒక్కసారి కూడా మంచి న్యాయవాదిని పంపించి న్యాయపరమైన చిక్కులను తొలగించడం లేదని చెప్పారు.తక్షణమే రాష్ట్రంలో ఫిజికల్ ఈవెంట్స్ పూర్తిచేసుకుని మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నా 39,000మంది నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.అలాంటి పరిస్థితులు వస్తే దానికి సంపూర్ణమైన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారా లోకేష్, హోం శాఖ మంత్రి బాధ్యత వహించాలని తెలిపారు.జనసేన బిజెపి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చిన వెంటనే నెలలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం తరువాత నిద్రలో జారుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ భాష,నగర ఉపాధ్యక్షులు మహేష్ ఓల్డ్ సిటీ కార్యదర్శి అంజి,నిరుద్యోగ నాయకులు నరేష్,రమేష్,ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు 200మంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...