టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలి...లబ్ధిదారులతో సమావేశాలు,సదస్సులు ఏర్పాటు చేస్తాం...ప్రభుత్వం స్పందించే వరకు పోరాటాలు నిర్వహిస్తాం...కె.రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి...

టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలి

లబ్ధిదారులతో సమావేశాలు,సదస్సులు ఏర్పాటు చేస్తాం

ప్రభుత్వం స్పందించే వరకు పోరాటాలు నిర్వహిస్తాం

కె.రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : 

పేదల కొరకు ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.బుధవారం ఆయన కర్నూలు నగర శివారులో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయాన్ని పరిశీలించి,అక్కడ నివాసముంటున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కె.రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు 2017లో - పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో టిడ్కో పేరుతో నాణ్యతతో కూడిన గృహాలు నిర్మించడం జరిగిందన్నారు.కర్నూలు నగరంలో సుమారు 10,400 గృహాలు రూ.575కోట్లతో నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.90శాతం పూర్తి అయిన గృహాలను అతరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో పాటు అద్దె చెల్లించలేక, లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కర్నూలు నగర శివారులో ఉన్న టిడ్కో గృహాలకు నీటి వసతి,డ్రైనేజి,రవాణా సౌకర్యం లేదన్నారు.అయితే ఇప్పటికే ఇంటి అద్దె చెల్లించలేని సుమారు 130మంది లబ్దిదారులు వారికి కేటాయించిన గృహాల్లో నివాసం ఉంటున్నారన్నారు.
రాత్రి వేళల్లో విషసర్పాలు వస్తున్నాయని, నీళ్ళు రోజుమార్చి రోజు వస్తున్నాయని, ప్రభుత్వం ఇచ్చే రేషన్ కోసం నగరంలోకి పోయి తెచ్చుకోవలసి వస్తుందని,రవాణా సౌకర్యం లేదని ఇక్కడ నివాసం ఉంటున్న లబ్దిదారులు చెపుతున్నారన్నారు.ప్రభుత్వం ఇంటిని ర్మాణాల కోసం ఇప్పటి కే రూ.500 కోట్లు ఖర్చు చేసిందని,మరో రూ.100 కోట్లు ఖర్చుచేస్తే 10,400 గృహాలకు కావలసిన మౌళిక వసతులు కల్పించవచ్చన్నారు. ప్రభుత్వం వెంటనే టిడ్కో గృహాల్లో మౌళిక వసతులు కల్పించి లబ్దిదారులకు కేటాయించాలన్నారు.లేని పక్షంలో లబ్దిదారులను ఒక వేధిక మీదకు తీసుకు వచ్చి టిడ్కొ గృహాలకు మౌళిక వసతులు కల్పించాలని,త్వరలోనే టిడ్కో గృహాల లబ్దిదారులతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సదస్సు నిర్వహిస్తామన్నారు.టిడ్కో లబ్దిదారులకు పంపిణీ చేసేంత వరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.అనంతరం టిడ్కో అధికారి రవికుమార్ గుప్తతో మాట్లాడి,టిడ్కో గృహాల మౌళిక వసతులు కల్పించి లబ్దిదారులకు పంపిణీ చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య,సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప,సీనియర్ నాయకులు కె.జగన్నాథం,నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి,సహాయ కార్యదర్శులు సి.మహేష్, డి,శ్రీనివాసరావు,నగర కార్యవర్గ సభ్యులు బీసన్న,నల్లన్న,అన్వర్,సోమన్న, నాగరాజు,కుమార్,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ కుమార్, నగర అధ్యక్ష, కార్యదర్శులు అభి,అశోక్,ఏఐటీయూసీ నాయకులు రామాంజనేయులు,పెద్ద ఎత్తున సీపీఐ నాయకులు,వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...