ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు...పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్....
ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు
పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
కర్నూలు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలియజేశారు. బుధవారం నగరంలోని రాజానగర్,బిషప్ సెంట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్,గౌతమి నగర్,గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో మార్చి,17వ తేది నుండి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల కోసం 172పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.172 పరీక్ష కేంద్రాలలో
40,776 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు.208మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.జిల్లా వ్యాప్తంగా 208 మంది రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ లో 11మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు.172కేంద్రాలలో ఎలాంటి సంఘటనలు జరగలేదని,మిగతా పరీక్షలు కూడా ప్రశాంత వాతావరణలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Post a Comment