ఎస్ టియు ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు...
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
కర్నూలు నగరంలోని స్థానిక సలాం ఖాన్ ఎస్టియు భవనంలో మంగళవారం ఎస్ టి యు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి అధ్యక్షతన ముస్లిం ఉపాధ్యాయులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ రాష్ట్ర పూర్వపు అధ్యక్ష,ప్రధాన కార్యదర్షులు ఈ.షణ్ముర్తి,హెచ్.తిమ్మన్నలు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ సంఘంలో కూడా లేని విధంగా అన్ని కులాలు మతాల సంస్కృతులను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఎస్టియు కర్నూలు జిల్లా శాఖ క్రిస్మస్ క్యాండిలైట్,సంక్రాంతి ముగ్గుల పోటీలు,ఇఫ్తార్ విందు కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం అని పేర్కొన్నారు.
చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ 9వ నెల రమదాన్ నే రంజాన్ అన్నారు.సమస్త మానవాళికి మార్గ నిర్దేశంగా పవిత్ర ఖురాన్ గ్రంధం రంజాన్ మాసంలోనే అవతరించినందుకు కృతజ్ఞతతో ముస్లింలు నెల రోజులు విధిగా ఉపవాసాలు, దానధర్మాలు చేస్తారన్నారు.పండగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయన్నారు.పండగ అనేది ఏ మతానికి సంబంధించినదైన సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని,అలాగే రంజాన్ పండగ వెనుక కూడా మానవాళికి మంచి చేసే ఉద్దేశం ఉందనీ,క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనలను ప్రజలకు బోధిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కె.జనార్దన్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మహమ్మద్ షఫీ,రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ ముదాసీర్ అహ్మద్,గోవిందు,గోవింద్ నాయక్ సురేష్,మూర్తుజా వలి,ఉస్మాన్, అబ్దుల్ రహీం,మొహియుద్దీన్,ఖాజా మొహిద్దిన్, దేవదాస్,సుంకన్న,ముస్లిం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Post a Comment