ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...లోగో ఆవిష్కరణలో పిలుపునిచ్చిన లెనిన్ బాబు...
ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి
లోగో ఆవిష్కరణలో పిలుపునిచ్చిన లెనిన్ బాబు
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
తిరుపతి నగరంలో మే,15 నుంచి 18 వరకు జరిగే అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్,17వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని, ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు పిలుపునిచ్చారు.గురువారం నాడు కర్నూల్ నగరంలోని సిఆర్ భవన్ లో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలో లోగోను ఎన్.లెనిన్ బాబు ఆవిష్కరించారు.అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరంలో మే,15 నుంచి 18వరకు ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.మొదటిరోజు దేశ నలుమూలల నుండి వచ్చే వేలాదిమంది ఏఐవైఎఫ్ నాయకులు కార్యకర్తలతో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించి అనంతరం అన్ని రాష్ట్రాల నుండి 1000మంది ప్రతినిధులు ప్రతినిధుల మహాసభలో పాల్గొంటారన్నారు.ఈ మహాసభలో నేడు భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యపై,మతం పేరుతో జరుగుతున్న దాడులపై,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ దేశంలోని యువతను శాశ్వత నిరుద్యోగులుగా మారుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పైన సుదీర్ఘంగా మూడు రోజులపాటు చర్చించి భవిష్యత్తులో భగత్ సింగ్ నేషనల్ గ్యారెంటీ ఎంప్లాయిమెంట్ యాక్ట్ తీసుకువచ్చి దేశంలోనే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేయడానికి 17వ జాతీయ మహాసభలు వేదిక కానున్నాయని చెప్పారు.కావున ఈ మాహసభలకు అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు,శ్రీనివాసులు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో దేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి ఒక ప్రభుత్వ రంగ సంస్థను కూడా నెలకొల్ప లేక పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీల్లో భాగమైన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలకే పరిమితమవుతా ఉన్నారు తప్ప స్టిల్ పరిశ్రమను ఏర్పాటు చేయలేకపోతున్నారని,డబల్ ఇంజన్ సర్కార్ అయిన కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగమైన నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకుండా మోసం చేస్తుందని కావున రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు చేస్తున్న మోసాలపై యువతలో చైతన్యం నింపేందుకు నిరుద్యోగ సమస్యపై సమర శిల పోరాటాలు కొనసాగించడానికి తిరుపతిలో జరిగే 17వ జాతి మహాసభల వేదిక కానున్నాయని వారు తెలిపారు.ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, బిసన్న,నగర నాయకులు అఖిల్,ఖాసిం, కుమార్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment