ఐదు మంది గంజాయి విక్రదారులు అరెస్ట్... మధుసూదన్ గౌడ్,నాల్గవ పట్టణ సిఐ...

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు నగరంలోని,శరీన్ నగర్,వాటర్ ట్యాంక్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఐదు మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సిఐ మధుసూదన్ గౌడ్ పేర్కొన్నారు.ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మడం గాని, రవాణా చేయడం,కొనడం లాంటి కార్యకలాపాలు నిరోదించడంలో భాగంగా గత శుక్రవారం రాత్రి రాబడిన సమాచారం మేరకు శరీన్ నగర్ లోని పార్క్ నందు గల వాటర్ ట్యాంక్ వద్ద గంజాయి విక్రయిస్తున్న కర్నూలు నగరం, ఓల్డ్ కల్లూరు,చెంచునగర్ కు చెందిన 
చిగుర్ల చిన్న నరసింహులు @ చిన్ని, కల్లూరు ఊరు వాకిలి ప్రాంతానికి చెందిన పి.రంగనాయకులు,ఓ మహిళా,షేక్ ఇస్మాయిల్,కృష్ణానగర్ కు చెందిన కె.కృష్ణలు గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా తయారుచేసి వ్యాపారం చేసే ప్రయత్నం చేశారని అన్నారు.అ ప్రయత్నంలో ఉండగా ఎస్సై గోపీనాథ్,సిబ్బందితోపాటు,గెజెటెడ్ అధికారి గురు స్వామిరెడ్డి,ప్రభుత్వ అధికారుల సమక్షం లో దాడి చేసి వారి నుండి 2.7 కేజీల గంజాయిని స్వాదీనపరచుకొని, వారిని రిమాండ్ చేసినట్లు చెప్పారు.ఇంకా ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని సైతం అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.

పొలిసువారి హెచ్చరిక :

నాలగవ పట్టణ సిఐ మధుసూదన్ గౌడ్ ప్రజలు,యువతను మత్తు పదార్థాలు సారా,గంజాయిలాంటి మత్తు పదార్థాలకు దూరముగా ఉండాలనీ,మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. ఎవరయినా మత్తు పదార్థాలు అమ్మితే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని సిఐ మధుసూదన్ గౌడ్
ఈసందర్బంగా హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...