స్వచ్చత పనుల నిర్వహణపై అభిప్రాయం తెలుపండి...నగర ర్యాంకు మెరుగుదలకు సహకరించండి...ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్...

స్వచ్చత పనుల నిర్వహణపై అభిప్రాయం తెలుపండి

నగర ర్యాంకు మెరుగుదలకు సహకరించండి

ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

కర్నూలు నగరంలో రోజువారీ స్వచ్చత పనులపై నగర ప్రజలు తమ అభిప్రాయం తెలపాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బుధవారం ఒక ప్రకటనలో కోరారు.కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా నగరాలు,పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై మదింపు జరిపి ర్యాంకులు ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని,కర్నూలు నగరం ఆరంభంలో 221వ ర్యాంకులో ఉండగా, ప్రజలందరి భాగస్వామ్యంతో పురోగతి సాధించుకుంటూ, గత సంవత్సరానికి 32వ ర్యాంకుకు చేరుకున్నదని పేర్కొన్నారు.అయితే ఈ ఏడాది సింగిల్ డిజిట్ ర్యాంకు సాధించాలనే సంకల్పానికి నగరంలోని ప్రతి పౌరుడి సహకారం అవసరం అన్నారు.ఇందు కోసం స్వచ్చ సర్వేక్షన్ వెబ్‌సైట్‌ https://sbmurban.org/feedback ను ఓపెన్ చేసి స్వచ్ఛతకు సంబంధించి పది ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలరని కోరారు.ఈ సర్వే మార్చి,31నాటికి పూర్తి అవుతుందన్నారు.కర్నూలు నగర ర్యాంకును జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రతి పౌరుడు ఫిడ్‌బ్యాక్ నమోదు చేయాలని కమిషనర్ కోరారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...