పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి...కెవిపిఎస్ డిమాండ్...

VS9TV న్యూస్,కల్లూరు :

కల్లూరు అర్బన్ పరిధి,32వ వార్డ్, ముజఫర్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ముజఫర్ నగర్ ఆటో స్టాండ్ వద్ద పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కెవిపిఎస్ ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులు ఇ.రామాంజనేయులు అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా సిఐటియు నాయకులు కె.సుధాకరప్ప, కెవిపిఎస్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు యం.సి. ఆనంద్,డివైఎఫ్ఐ నగర కార్యదర్శి యస్. హుస్సేన్ భాష మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక మైనార్టీలపై జరుగుతున్న దాడులు కాస్త మతోన్మాదులు హత్యలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని విమర్శించారు.ప్రవీణ్ పగడాల మరణం ముమ్మాటికి మతోన్మాదుల హత్యేనని, ప్రభుత్వం దీనిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ప్రవీణ్ పగడాల సోషల్ మీడియాలో పదేపదే తమకు ప్రాణహాని ఉందని చెబుతున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయనకు సరైన భద్రత కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణమని తెలిపారు‌.ఆయన మృతిపై ఇప్పటికే ప్రజాసంఘాలు,ప్రజాతంత్ర వాదులు,లౌకికవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని,ప్రభుత్వం స్పందించి ఆయన మృతిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయమైన రిపోర్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ కార్యకర్తలు కె.సురేష్,ఎం.శ్రావణ్, వై.సుధాకర్,ఎం.రాజు,మహేష్,వెంకటేష్, కె.బీసన్న,టి.ఈశ్వరమ్మ,మాణిక్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...