ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హల్ లో అన్ని విభాగాల హెచ్వోడీస్ లతో సమీక్ష...డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్...

ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హల్ లో అన్ని విభాగాల హెచ్వోడీస్ లతో సమీక్ష

డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హల్ లో వివిధ విభాగాల హెచ్ ఓడిలతో ఐవిఆర్ఎస్,ఎన్టీఆర్ వైద్య సేవ,ఈ హాస్పటల్,పలు అంశాలపై బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలోని ఎన్టీఆర్ వైద్యసేవకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా జరిగేటట్టు చూసుకోవాలని సంబంధించిన హెచ్ ఓ
డిలకు ఆదేశించారు.ఈ హాస్పిటల్ లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించడం జరిగిందని అన్నారు.అనంతరం ప్రతి విభాగపు ప్రొఫెసర్ ను నోడల్ ఆఫీసర్ గా ఉండి రెగ్యులర్గా ఒపి,ఐ పి,డిశ్చార్జ్ డేటాను ఈ హాస్పిటల్ లో అప్లోడ్ చేయడానికి హౌస్ సర్జన్స్,పీజీలు,నర్సింగ్ సిబ్బంది సేవలను వినియోగించుకొనేలా చూసుకోవాలని,ప్రతిరోజు ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్,మానిటరింగ్ చేయాలని వారికి ఆదేశించినట్లు తెలిపారు.(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ఐవిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సిస్టంలోని ముఖ్యంగా వైద్యులు,వైద్యసిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి ఆయా విభాగాలలో వైద్యులు,సిబ్బంది సమయపాలన ఉండాలని అన్నారు. పేషంట్స్ కు ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి.పేషెంట్ కు సంబంధించిన ఈ హాస్పిటల్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ను ప్రతిష్టకంగా అమలు చెయ్యాలి.ఇందులో భాగంగా క్యాజువాలిటీ,ఐపి,ఓపీలు బర్త్ మరియు డెత్,ఫార్మసీ మాడ్యూల్, డయాగ్నస్టిక్ సంబంధించిన రికార్డులను ప్రతిష్టకంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధించిన హెచ్చోడిలకు ఆదేశించారు.అనంతరం దశలవారీగా ఆయా విభాగాలకు సంబంధించిన ఆడిట్ చేస్తామని చెప్పారు.క్యాజువల్టికి వచ్చే పేషంట్లకు ఇమ్మీడియట్ గా అడ్మిషన్ అయ్యేవిధంగా చూసుకోని వారికి ఆయా విభాగాలకు షిఫ్ట్ అయ్యే విధంగా చూసుకోవాలన్నారు. క్యాజువాలిటీలోని (ఎల్లో జోన్) మరమ్మత్తులు పూర్తయ్యాయి.త్వరలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. క్యాజువాలిటీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేనియెడల వారిపై వేటుకు రంగం సిద్ధమన్నారు.ఆసుపత్రిలో ఆయా విభాగాలలో ఉండే పేషెంట్లకు సంబంధించిన ఖరీదైన మందులకు ఇండెంట్ పెట్టేటప్పుడు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు సిగ్నేచర్ ఉండేలా చూసుకోవాలన్నారు.ఎస్ ఐసియు విభాగంలో అడ్మిషన్ లో డెత్ అయిన కేసులకు ఆయా విభాగాల హెచ్ ఓడి సిగ్నేచర్ తో పాటు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అన్నారు.గైనిక్ విభాగంలో శిశు ఆధార్ సంబంధించిన రూమ్ ను పరిశీలించాలని గైనిక్ హెచ్వోడికి ఆదేశించారు.ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్ అందుబాటులో ఉన్నాయని అన్నారు.ఒపి విభాగాలలో సమయపాలన పాటించాలని,లేనిఎడల వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.త్వరలో పలు ఓపి విభాగాలకు సర్ప్రైజ్ విజిట్ చేస్తానని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్,డా.శ్రీరాములు, డా.సీతారామయ్య,కేఎంసీ వైస్ ప్రిన్సిపల్,డా.రేణుక దేవి,ఆసుపత్రి సిఎస్ ఆర్ ఎంఓ డా.వెంకటేశ్వరరావు,అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రహ్మణ్యం,హెచ్వోడీలు డా.శ్రీనివాసులు,డా.లక్ష్మీబాయి, డా.మాధవి శ్యామల,హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డా.శివబాల నగాంజన్,డా.కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...