చిన్నారి ఖర్చులకు ఐదువేలు సహాయం...డీఈఓ...

చిన్నారి ఖర్చులకు ఐదువేలు సహాయం...డీఈఓ...

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
  
పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.శ్యామ్యూల్ పాల్ కోసిగిలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన పదవతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి చిన్నారిని పరీక్ష అనంతరం మౌంట్ కార్మెల్ పాఠశాలకు వెళ్లి పలకరించారు.కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేనందున,గత్యంతరం లేని స్థితిలో రూ.450 దినసరి కూలీగా తన తల్లిదండ్రులలో పాటు గుంటూరు మిరపకాయల పనికి వెళ్ళింది.స్థానికులు సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో చిన్నారి పరీక్షలు రాసేలా ప్రయాణం ఏర్పాట్లు చేశారు.ఆ బాలిక డీఈఓతో మాట్లాడుతూ గత పరీక్షల్లో తనకు మెరుగైన మార్కులు వచ్చాయని,పరీక్షలో కూడా 80మార్కులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.గైర్హాజరైన సబ్జెక్టులను సప్లిమెంటరీ పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటానని చెప్పడం, ఖచ్చితంగా పాసై ఇంటర్మీడియట్ బైపిసి చదువుతానని చెప్పడంను డీఈఓ ప్రత్యేకంగా అభినందించారు.చిన్నారి చెప్పిన విషయాలపట్ల స్పందించిన డీఈఓ ఐదువేలు వెంటనే ఇచ్చి ధైర్యం చెప్పారు. పదవతరగతి అనంతరం ఇంటర్మీడియట్ విద్యకు కస్తూరిబా కళాశాలలో చేర్పించి చదివిస్తామని, ఆదుకుంటామని డీఈఓ హామీ ఇచ్చారు. చిన్నారి పదవతరగతి పరీక్షలు వదిలేసి గుంటూరుకు వలస వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ వార్త పత్రికల్లో ప్రచురితమవ్వడంతో ప్రభుత్వం స్పందించింది.చిన్నారి పరీక్షలు రాసేలా గుంటూరు - కర్నూలు జిల్లాల కలెక్టర్లు చొరవ తీసుకొని స్వగ్రామానికి రప్పించారు. చిన్నారి పరీక్షలకు హాజరయ్యేలా జిల్లా విద్యాధికారి తక్షణ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 172 కేంద్రాలకుగానూ 253మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.ప్రైవేట్ లో 40 విద్యార్థులు గైర్హాజరయ్యారు.జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...