రోడ్డు భద్రతా నియమాలు పాటించడం అందరి కర్తవ్యం...ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు...కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్...జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన చేయాలని
కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ పిలుపు నిచ్చారు.ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు రహదారి భద్రతపై విస్తృత అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,కర్నూలు జిల్లా పోలీసు అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో ప్రజలకు రోడ్డు భద్రత,రహదారి నిబంధనలపై శనివారం అవగాహన కల్పించారు.బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలని, వేసవి కాలంలో సెలవులు రానునుండడంతో మైనర్లు విచ్చలవిడిగా బైక్ లు నడపడం చేయకూడదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని,ఓవర్ స్పీడ్ చేయకూడదని,ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకూడదని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ వంటి వాటి వలన రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదని ముఖ్య పట్టణాలలో,రద్దీ ప్రాంతాలలో రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై ప్రజలకు సూచించారు.
ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలన్నారు.హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకొని కుటుంబాలను రక్షించుకోవాలన్నారు.బాధితులు ఎక్కువ శాతం హెల్మెట్ ధరించని వారేనన్నారు.ప్రజల్లో ముఖ్యంగా పిల్లలు,యువకుల తల్లిదండ్రులు కూడా సామాజిక బాధ్యత వహించాలన్నారు. ఒక ఇంటి యజమాని రహదారి ప్రమాదంలో మరణించినట్లయితే ఆ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నమై అవస్థలు పడాల్సి వస్తుందన్నారు.ప్రతి ఒక్కరు కూడా రహదారి నియమాలపై కనీస అవగాహన పెంచుకోవాలన్నారు.రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారకులు కావొద్దన్నారు. తీరు మారకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.ఇటీవల కాలంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువవుతోందని,దీనికి ముఖ్య కారణం చాలా మంది మద్యం తాగి వాహనాలు నడపడం,మైనర్ల డ్రైవింగ్ తో ప్రమాదాల బారిన పడుతున్నారు.వేసవి సెలవులు రానునుండడంతో యువకులు,మైనర్లు బైక్‌లతో ర్యాష్ డ్రైవింగ్ చేయడం, రహదారులు ఖాళీగా ఉన్నాయని,వాయు వేగంతో వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతాయన్నారు.మైనర్లకు వాహనాలు ఇవ్వడం తల్లిదండ్రులు మానుకోవాలన్నారు. అవగాహన లేకుండా వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. దీని వల్ల ఇతరులు సైతం ప్రమాదాల బారినపడే అవకాశం ఉందన్నారు.మార్చి, 22వ తేది నుండి మార్చి,28వ తేదీ వరకు ఒక వారంలో పోలీసులు తీసుకున్న చర్యల గురించి జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు.రోడ్డు ప్రమాదాల కేసులు 12 నమోదు అయ్యాయి.5మంది మృతి చెందారు.11మంది గాయాలపాలయ్యారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 159డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి,కోర్టుకి హజరు పరచడం జరిగిందని వారు తెలిపారు.
Comments
Post a Comment