31మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత...
డాక్టర్ కె.చిట్టి నరసమ్మ,అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్,మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్...
VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
కర్నూలు,నంద్యాల మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లు, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు యందు కాంట్రాక్ట్ / అవుట్ సోర్సింగ్ క్రింద 9 కేటగిరీలకు చెందిన పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు లలో వివిధ టెక్నికల్,నాన్ టెక్నికల్ పోస్టుల నియమకాలకోసం 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ లో మెరిట్ రోస్టర్ ప్రకారం ఎంపికైన 9కేటగిరీల చెందిన మొత్తం 31మంది అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్వజన వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు,కర్నూలు మెడికల్ కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ మంజుల రాణి,ఏఓలు లక్ష్మీప్రసన్న,రమ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment