ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు...సీఎం చంద్రబాబు నాయుడు...
VS9TV న్యూస్,ఏలూరు ప్రతినిధి :
సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా, ఆగిరి పల్లి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.ఎవరైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరిరోజు అని హెచ్చరిస్తున్నా అని అన్నారు.మహిళలను గౌరవప్రదంగా బతక నివ్వాలని,చేతనైతే విలువలు నేర్పించాలన్నారు.వైఎస్ భారతిపై చేసిన అసభ్య వ్యాఖ్యల సందర్భంలో చంద్రబాబు కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.జ్యోతిరావు పూలే అందరికి ఆదర్శం..సమానత్వం మానవతా విలువలు పూలే సొంతం అన్నారు. బీసీలు టీడీపీకి వెన్నెముక,జిల్లాల వారీగా బీసీల అభివృద్ధికి ముందుకు వెళుతున్నామన్నారు.ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి..నేను పవన్ కల్యాణ్ అభివృద్ధిపై దృష్టి పెట్టాం...జీరో పవార్టీ వినూత్న కార్యకమం...పి4 కోసం తెలుగులో పేరు వెతికాం.కానీ,దొరకలేదన్నారు. సమాజంలో ఎంతో మంది గొప్పవారు అయ్యారు.ఆగిరిపల్లిలో 206కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.మార్గదర్శిలు వచ్చి ఈ కుటుంబాలను ఆదుకోవాలి.ఆగిరిపల్లిలో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే బాధ్యత జిల్లా కలెక్టర్ యంత్రాంగం తీసుకోవాలన్నారు.విద్యుత్ మరుగుదొడ్లు,మంచినీరు ఇలా అన్ని అంశాల్లో జిల్లా యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని సూచించారు.ఇక, ఆగిరిపల్లిలో పి4లో భాగంగా కొన్ని కుటుంబాల బాధ్యతలను నూజివీడు సీడ్స్ అధినేతకు ప్రభాకర్ కు అప్పగించారు.అనంతరం ఆగిరిపల్లి మండలం,వడ్లమానులో పర్యటించారు. కులవృత్తులు చేసుకునే వారి ఇళ్లకు వెళ్లారు.కులవృత్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.బీసీ వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లిన సీఎం..కోటయ్య పశువుల పాకను పరిశీలించారు.గేదెల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు.
Comments
Post a Comment