కార్మిక వర్గ ప్రయోజనాల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ ఇ.బాలానందన్...ఎం.ఏ.గఫూర్,సిఐటియు రాష్ట్ర నాయకులు...
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
కర్నూలు నగరం,కొత్తబస్టాండ్ దగ్గర ఉన్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ నందు శనివారం సిఐటియు ప్రాంతీయ వర్క్ షాప్ ప్రారంభానికి ముందు ఉమ్మడి కర్నూలు జిల్లా సిఐటియు సీనియర్ నాయకులు మద్దులు సీఐటీయూ జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం జరిగిన కామ్రేడ్ఈ బాలానందన్ శత జయంతి సభ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన వహించారు.
కార్యక్రమానికి హాజరైన సిఐటియు రాష్ట్ర నాయకులు ఎం.ఎ గఫూర్,ఓబుల్ లు సభ ప్రారంభానికి ముందు ప్రఖ్యాత కార్మికనేత, సిఐటియు అఖిల భారత మాజీ అధ్యక్షులు కామ్రేడ్ ఈ బాలానందన్ శతజయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎం.ఏ గఫూర్ మాట్లాడుతూ కామ్రేడ్ బాలానందన్ కార్మికుల హక్కుల పట్ల, సిద్ధాంత వక్రీకరణల పట్ల ఏమాత్రం సడలింపులను రాజీపడని పోరాటయోధుడు, వ్యవస్థ మార్పును తీసుకురాగలిగిన కార్మిక వర్గ శక్తి సామర్థ్యం పట్ల తన జీవితం అంతం వరకు పోరాడిన పోరాట కార్యశీలి అని కొనియాడారు.బాలానందన్ ఉన్నత చదువులు అభ్యసించినప్పటికీ,ఆయనకి ఉన్న అంకిత భావం నిబద్ధత,రాజకీయ సిద్ధాంత అంశాల పట్ల చాలా లోతైన అద్భుతమైన అధ్యయనం జరిపారన్నారు.1940లో కేరళలోని అల్యూమినియం పరిశ్రమలో కార్మిక జీవితం ప్రారంభించి,తరువాత జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ పారిశ్రామిక ప్రాంతం అంతటిలోనూ కార్మికులను సంఘటిత పరిచి,కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో ముందు పీఠాన నిలిచాడని అన్నారు.
1944లోఅల్యూమినియం ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ ఏర్పాట్లు కామ్రేడ్ బాలానందం చురుకైన పాత్ర పోషించారు.కార్మిక సంఘాలను నిర్మించే పనిని వదిలివేస్తే తనను పర్మనెంట్ ఉద్యోగిగా చేస్తానని,పరిశ్రమ యజమాని ఆశ చూపిన లొంగకుండా కార్మిక పక్షాన నిలిచిన మహాత్యాగి.ఇండియన్ అల్యూమినియం గృహ సామగ్రి తయారీ, దుస్తులు,విద్యుత్తు,భారీ ఇంజనీరింగ్, జీడిపప్పు,కొబ్బరి పీచు,తోటలు,చేనేత వంటి అనేక ప్రాంతాలలో కార్మికులను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు.1975 నుంచి 1977 వరకు ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ నిరంకుశ నిర్బంధాన్ని ఎదుర్కొనడంలో రహస్య సమావేశాలను నిర్వహించి సమన్వయ పరిచిన్నట్లు చెప్పారు.ఎమర్జెన్సీ కాలంలో బాలానందం మూడుసార్లు అరెస్టు చేయబడ్డారు.ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు.1953లో జాతీయ స్థాయిలో జరిగిన సమ్మెకు దేశవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగుల సమీకరణలో కామ్రేడ్ బాలానందన్ అత్యంత కీలకంగా వ్యవహరించారు.కేరళ రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడంలో బలమైన పోరాటాలు నిర్మించడంలో కీలక పాత్ర వహించారు.1967 నుండి 1968 వరకు మరియు 1970 నుండి 1976 వరకు కేరళ అసెంబ్లీ శాసనసభ్యులుగా,1980 సంవత్సరం లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారు.అనేక పార్లమెంటరీ కమిటీల్లో కార్మిక వర్గ ప్రయోజనాల కొరకు కృషి చేశారు.1982 ఇండస్ట్రియల్ డిస్ప్యూటీ ఆక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1982 అసంఘటిత రంగ కార్మిక సామాజిక భద్రత చట్టం 2008 వంటి చట్టాలను తేవడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.1972 సంవత్సరంలో కేంద్ర కమిటీ సిపిఎం సభ్యులుగా ఎన్నికయ్యారు. అంచలంచలుగా ఎదుగుతూ కార్మిక ఉద్యమానికి,పార్టీకి దిక్సూచిగా నిలిచి, నీతి,నిజాయితీకి మారుపేరుగా నిలిచిన కామ్రేడ్ బాలానందన్ అడుగుజాడల్లో పయనించి,కార్మిక ఉద్యమాన్ని బలోపేతంగా నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి అంజిబాబు,కడప జిల్లా కార్యదర్శి మనోహర్,నంద్యాల జిల్లా కార్యదర్శి ఏ. నాగరాజు అనంతపురం జిల్లా అధ్యక్షులు నాగమణి,సత్యసాయి జిల్లా కార్యదర్శి వెంకటేష్,కర్నూలు నగర కార్యదర్శులు సి.హెచ్.సాయిబాబా,విజయ్,నగర అధ్యక్షులు ఆర్.నరసింహులు,ఎస్.అబ్దుల్లా,నగర నాయకులు కె.ప్రభాకర్,ఎస్.మహమ్మద్ రఫీ,కె.సుధాకరప్ప,టి.రాముడు,జి.ఏసు, మహమూద్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment