ఆటోలో మరచిపోయిన బ్యాగు, బంగారంను బాధితుడికి అప్పగించిన కర్నూలు పోలీసులు...
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు కమాండ్ కంట్రోల్ పోలీసులు ఆటోలో పోగొట్టుకున్న బ్యాగ్,బంగారంను ఆదివారం గుర్తించి,బాధితుడికి అందించిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా,కొత్తపల్లెకి చెందిన శ్రీధర్ బ్యాంకు ఉద్యోగి.కర్నూలు,నంద్యాల చెక్ పోస్టు దగ్గర ఉన్న మెగా సిరి ఫంక్షన్ హాలులో ఒక పెళ్ళికి హాజరయ్యారు.అనంతరం అతని కుటుంబంతో కలిసి కర్నూలు,నంద్యాల చెక్ పోస్ట్ వద్ద ఆటో ఎక్కాడు.కర్నూలు సుంకేశుల రోడ్డులో ఉన్న కార్తీక హాస్పిటల్ నందు దిగారు.బ్యాగులో ఒక జత బంగారు కమ్మలు సుమారు (రూ.75 వేలు విలువ గల 10గ్రాముల బంగారం) ఉంది.అనంతరం హాస్పిటల్ కు వెళ్ళి చూసుకోగా బ్యాగును ఆటోలో మరచి పోయినట్లు బాధితుడు కమాండ్ కంట్రోల్ పోలీసులకు పిర్యాదు చేశాడు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సిఐ శివశింకర్ ఆధ్వర్యంలో ఎఎస్సైలు సుబ్బరాజు,అస్లాం,కానిస్టేబుళ్ళు లక్ష్మణ్,జిలానిలు సీసీ కెమెరాల ద్వారా ఆటోని ట్రేస్ ఔట్ చేశారు.ఆటో డ్రైవర్ ని పిలిపించి బాధితునికి వారి సొమ్మును తిరిగి అప్పగించారు.
Comments
Post a Comment