గోల్డ్ టైమ్...ఎవడ్రా ఆపేది అంటూ పాత రికార్డులను బద్దలు కొడుతున్న బంగారం ధర...
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
గోల్డ్ టైమ్ నడుస్తోంది.ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఒకటే మాట...బంగారం ధర లక్ష రూపాయలకు పోతుందట కదా అనే మాటే వినిపిస్తోంది.ఈ టైమ్‌లో బంగారాన్ని కొనడమే కాదు...అమ్మడం కూడా ఎక్కువగానే జరుగుతోంది...లక్ష దిశగా పరుగులు పెడుతోంది బంగారం ధర.మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పాత రికార్డులను బద్దలు గొడుతూ జెట్ స్పీడ్‌గా దూసుకుపోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు చూస్తున్నాం.లక్ష రూపాయల దిశగా కంటిన్యూ అవుతోంది గోల్డ్ రన్.ఆల్‌టైమ్ హైలో బంగారం ధరలు ఉన్నాయి.గత బుధవారం నాటికీ పోలిస్తే పది గ్రామాల బంగారం ధర రూ.710 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98380వేలకు చేరుకుంది.లక్షకు కేవలం 1620 రూపాయల దూరంలో ఉంది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.91,110కు చేరుకుంది.
Comments
Post a Comment