శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు సర్వస్వం త్యాగం చేసిన అవుట్ సోర్సింగ్ లస్కర్లు పర్మినెంట్ చేయాలి...ఔట్ సోర్సింగ్ లస్కర్ల సంఘం...

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు సర్వస్వం త్యాగం చేసిన అవుట్ సోర్సింగ్ లస్కర్లు తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ మంగళవారం ఔట్ సోర్సింగ్ లస్కర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జల మండలి నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సర్వీస్ 62సంవత్సరాలు చేయాలని, తమ మరణం అనంతరం ఉద్యోగాలు తమ పిల్లలకు ఇచ్చేందుకు వీలు కల్పించాలని కోరుతూ నినదించారు.ఫ్ల కార్డులు చేతబట్టి సాగిన ర్యాలీ నగర పౌరులను ఆకర్షించింది.ఈ సందర్భంగా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన సభను ఉద్దేశించి సంఘం అధ్యక్షులు జి.నాగన్న మాట్లాడుతూ జీఓ వచ్చి 40సంవత్సరాలు అయినా నేటికీ అమలు కాకపోవడం దురదృష్టమని వాపోయారు.జీఓ ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి దివంగత నేత ఎన్టీ రామారావు ప్రభుత్వం అన్నారు.అప్పటి నుంచి నేటి వరకు పాలించిన ప్రభుత్వాలు తమను మోసం చేశారని ఆవేదన చెందారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఓ అమలు చేసి,పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చి,తమ కుటుంబాలను ఆదుకుని,న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు,మంత్రులు,ఎంపీలు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. తమకు పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు.సభ అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓకు అందజేశారు.
ఈ ర్యాలీకి డివిజన్లో నుంచి లస్కర్లు తరలివచ్చి జయప్రదం చేయడం పట్ల అధ్యక్షులు నాగన్న ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు అక్షయ్, రంగస్వామి,గౌస్,మనోహర్,చెన్నయ్య, హుస్సేనయ్య,రఘురాం రెడ్డి,చెంచిరెడ్డి, రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...