రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు.మద్యం తాగి వాహనం నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు పలు ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.నిబంధనలు పాటించకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పై కేసులు నమోదు చేశారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిత్యం పెరిగిపోతున్నాయని,మద్యం తాగి వాహనాలపై ఎక్కిఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తూ ప్రజల ప్రాణాలపైకి తెస్తున్నారని,వాటిని అరికట్టేందుకే ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఫిబ్రవరి నెలలో 1022 కేసులు, మార్చి నెలలో 702 కేసులు,ఏప్రిల్,15వ తేది వరకు 319 కేసులు నమోదు చేశారు.ఒక్కొక్కరిపై మూడువేల వరకు జరిమానా విధించారు.
Comments
Post a Comment