పోలీస్,వైద్య,న్యాయ విభాగాలకు మధ్య వారదిలాంటిది ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగం...

డాక్టర్ డి.ఎస్.ఎల్.వి నరసింహులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్...

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

పోలీస్,వైద్య,న్యాయ విభాగాలకు మధ్య వారది లాంటిది ఫోరెన్సిక్ మెడిసిన్,టాక్సి కాలజీ విభాగం అని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ డి.ఎస్.ఎల్.వి నరసింహులు అన్నారు.కర్నూలు మెడికల్ కాలేజీలో శనివారం 6వ,రెండు రోజుల రాష్ట్రస్థాయి వార్షిక ఫోర్ మేడ్కాన్ 2025 సందర్బంగా ఫోరెన్సిక్ విభాగపు అధిపతి,ప్రొఫెసర్ డాక్టర్ సాయి సుధీర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రారంభ సమావేశంలో ఆయన హాజరయ్యారు.ఈ సందర్బంగా డి.ఎం.ఇ డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ ఫోరెన్సిక్ విభాగంలో మెడికో లీగల్ డాక్యుమెంటేషన్ అన్నది చాలా ముఖ్యమని అన్నారు.ఇది మిగిలిన డిపార్ట్మెంట్ల కంటే అధిక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు.క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ అన్నది ఒపి విభాగంలో చేర్చడానికి ప్రభుత్వానికి నివేదించామని,అనుమతి లభించిన వెంటనే ఓ.పి విభాగంలో కూడా సేవలందిస్తుందన్నారు.ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా ఖచ్చితమైన ఫలితాలను అందించగలుగుతుందన్నారు.ఎం.ఎల్.సి కేసుల్లో ఫోరెన్సిక్ విభాగం యొక్క రిపోర్టింగ్ వల్లనే అసలైన నిందితులను గుర్తించడం జరుగుతుందన్నారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎంతో కఠినమైన మెడికో లీగల్ కేసుల్లో పోరెన్సిక్ విభాగం సేవలు మరువలేనివి. ఆ విభాగం అందించే రిపోర్టుల ద్వారానే నేరపరిశోధనలో వాస్తవ విషయాలు వెలుగు చూస్తున్నాయన్నారు. క్రైమ్ కేసుల్లో పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నారని,బయటి సమాజానికి ఇది కనిపిస్తుందన్నారు.అయితే ఈ నేర పరిశోధనలో "రియల్ హీరోస్" ఫోరెన్సిక్ విభాగపు వైద్యులేనని వారు కొనియాడారు.మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఫోరెన్సిక్ విభాగం ఎంతో అభివృద్ధి చెందిందని,సాంకేతిక సదుపాయాలు కూడా ఫోరెన్సిక్ విభాగానికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయన్నారు.సర్వజన వైద్యశాల సూపర్ండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనకు ఫోరెన్సిక్ సబ్జెక్ట్ ఎంతో ఇష్టమన్నారు.ఈ సబ్జెక్ట్ లో ప్రతి విషయానికి ఒక కథతో అనుసంధానించబడి ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ ప్రకాష్,రిటైర్డ్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డా.వీరనాగిరెడ్డి,ప్రొఫెసర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.బ్రహ్మాజీ మాస్టర్,ఎ పిఎఎఫ్ ఎం టి జనరల్ సెక్రటరీ డా. సుబ్బారావు,అసోసియేట్ ప్రొఫెసర్,ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ,ట్రెజరర్ డాక్టర్ కే.సి.రంగయ్య,రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మెడికల్ కళాశాలలోని ఫోరెన్సిక్ విభాగపు ప్రొఫెసర్లు,అసోసియేట్,అసిస్టెంట్లు,పీజీలు, యూజిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...