రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం..డాక్టర్ కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డిఐజి...విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ...
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంతో కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించారు.ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు సంయుక్తంగా శనివారం ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు.
వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు.మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకునేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.
Comments
Post a Comment