కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ప్ బిల్లును వెంటనే ఉపసంహరించు కోవాలి...ముస్లింల నిరసనకు సిపిఎం మద్దతు...

VS9TV న్యూస్,కల్లూరు :

పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ప్ బిల్లును ఉపసంహరించు కోవాలని ముజఫర్ నగర్ లోని మస్జిద్ ఏ మదీనా హిమాయత్తుల్లా మసీద్ లో శుక్రవారం ముస్లింలు ప్రార్థన తరువాత వక్ప్ చట్టాన్ని రద్దు చేయాలని పెద్దఎత్తున నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ముస్లింలు వక్ప్ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లింల ఆస్తులకు రక్షణ కల్పించాలని, బిజెపి విధానాలు నసించాలని నినాదాలు చేశారు.నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప హాజరై మద్దతును తెలియజేశారు.అనంతరం సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,ముస్లిం పెద్దలు ఉస్మాన్ భాష,షేక్షావలి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు తాము అధికారంలోకి రావడం కోసం ముస్లింల ఓట్లను దండుకోవడం కోసం ము‌స్లింల ఆస్తులు కాపాడుతామని, ముస్లింలకు న్యాయం చేస్తామని,వక్ప్ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ బిల్లు సందర్భంగా తెలుగుదేశం,జనసేన పార్టీలు పోటీ పడి బిజెపి ప్రవేశపెట్టిన వక్ప్ చట్టానికి మద్దతు తెలుపడం హేయమైన చర్య అన్నారు.పార్లమెంటు, రాజ్యసభలలో బిల్లుకు అనుకూలంగా మద్దతు తెలపడం ద్వారా ముస్లింలకు తీరని అన్యాయం ద్రోహం చేస్తున్నారని చెప్పారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిల్లుకు వ్యతిరేకంగా, రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా మద్దతు తెలపడం ఏమిటని వారు ప్రశ్నించారు.జగన్మోహన్ రెడ్డి రెండు రకాలుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు.ఈ చట్టం అమలు అయితే ముస్లిం ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాధత్తం చేయడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముస్లింల ఆస్తులు వక్ఫ్ చట్టంలోనే ఉండాలని,గతంలోనే సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు.ఇప్పటికే అనేక ముస్లిం సంఘాలు పెద్దలు సుప్రీంకోర్టును ఆశ్రయించారని,ఈ నెల 16వ తేదీ నుండి విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.ఈ చట్టం రద్దు అయ్యే వరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందన్నారు.ముస్లింలు రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉస్మాన్ భాష,ఇస్మాయిల్, షేక్షావలి,బషీర్ అహ్మద్, జహంగీర్ భాష, అబ్దుల్ కరీం,షరీఫ్ బాబు, రహిమాన్,నబిసాహేబ్,అనీఫ్,అబ్దుల్ రఫీ, అలీ,ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...