అంబేద్కర్ భవన్ ఆధునికీకరణ పనులను కమిషనర్ పరిశీలన....
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరం,రాజ్‌వీహార్ సమీపంలోని అంబేద్కర్ భవన్ లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు శుక్రవారం పరిశీలించి,పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంబేద్కర్ భవన్లో ఫ్లోరింగ్,పెయింటింగ్, ఎలక్ట్రికల్,తదితర ఆధునికీకరణ పనులను చేపట్టామని,ఈ నెల 14న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాష భవన్‌ను ప్రారంభిస్తారని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈ సత్యనారాయణ,డిఈఈ క్రిష్ణలత,ట్రైనీ ఏఈ మహేష్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment