పన్నుదారులు రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి...యస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్...
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపులపై వర్తింపజేస్తున్న రాయితీలను పన్నుదారులు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు సూచించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో పన్ను వసూలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...ఆస్తి పన్ను బకాయిదారుల వడ్డీపై 50శాతం రాయితీ,2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులపై 5శాతం పన్ను రాయితీని ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.వీటికి గడువు ఏప్రిల్,30 వరకు మాత్రమేనని వెల్లడించారు.పన్నులను నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రంతో పాటు,ప్రత్యేక కౌంటర్లలో సైతం చెల్లించవచ్చన్నారు.అలాగే పురమిత్ర యాప్,మీసేవ,ఆన్లైన్ కేంద్రంలో సైతం చెల్లించవచ్చన్నారు.పన్నుదారులు సత్వరమే పన్నులు చెల్లించి రాయితీలను పొందాలని, నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కమిషనర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ యన్.చిన్నరాముడు,ఆర్.ఓ. జునైద్,సూపరింటెండెంట్ క్రిస్టోఫర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment