హత్యాయత్నంకు పాల్పడిన నలుగురు నిందితులు అరెస్ట్...బాబు ప్రసాద్,కర్నూలు డిఎస్పీ...
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నంకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ బాబు ప్రసాద్ వివరాలు వెల్లడించారు.ఈ నెల 13వ తేదీన కల్లూరు మండలం,డి.మార్ట్ ప్రాంతం,టీడీపీ కార్యాలయంపై మీద దాడి చేసి,అందులో ఉన్న శేఖర్ గౌడ్,ఇతర వ్యక్తులను వేట కొడవళ్ళు, కత్తులతో హత్య చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పారు.ఈ కేసులో నిండుతులను కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అరెస్టు చేయడం జరిగిందన్నారు. అరెస్ట్ చేసిన వారిలో కర్నూలు నగరానికి చెందిన ఏ1 భూపని ప్రభాకర్ నాయుడు (32),ఏ2 కాశి @ కాశి బాబు(29),ఏ3 రహంతుల్లా(29),ఏ4 పటన్ సలాం ఖాన్ (29) లు ఉన్నట్లు పేర్కొన్నారు.అనంతరం వారి నుండి కత్తులు,వేట కొడవల్లను స్వాధీనం చేసుకొని, కోర్టు వారి ఎదుట హాజరచిన్నట్లు తెలిపారు.నిందితులు వీరందరూ వైసిపికి చెందిన వారు.ఈ కార్యక్రమంలో కర్నూలు నాల్గవ సిఐ మధుసూదన్ గౌడ్,ఎస్ఐ చంద్ర శేఖర్ రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment