నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్...చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి...కర్నూలు పోలీసులు...
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ,శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో ఆదివారం రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి,చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్బంగా సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Comments
Post a Comment