అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా చేసుకొని విధుల్లో పునరంకితం అవుదాం...
జిల్లా పోలీసు కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు...
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సంధర్బంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,కృష్ణమోహన్ లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా,కృష్ణమోహన్ లు మాట్లాడుతూ నిరుపేద,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడన్నారు.న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా,రాజకీయవేత్తగా,సామాజిక సంస్కర్తగా,రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. దళితులు,మహిళలు,కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడన్నారు.అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా చేసుకొని విధుల్లో పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు జావేద్,సోమశేఖర్ నాయక్, నారాయణ,ఆర్ ఎస్సైలు,ఎఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
Comments
Post a Comment