ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి...ఎస్ఎఫ్ఐ...
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వకముందే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు చేస్తూ,నోట్ బుక్స్,స్కూల్ బ్యాగులు,యూనిఫామ్, బెల్ట్,షూస్,పాఠ్యపుస్తకాలు ఇతర స్టేషనరీ విక్రయిస్తూ అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నారు అని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ కి శనివారం శనివారం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా,రంగప్ప మాట్లాడుతూ ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో విద్యార్థి శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.ఒకవైపు ప్రతి విద్యా సంవత్సరానికి ఏదో ఒక కారణంతో రూ.5 నుండి రూ.10వేలు వరకు ఫీజులు పెంచుతున్న యాజమాన్యం, మరోవైపు విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించే ఉపాధ్యాయులను క్వాలిఫైడ్ గా రిక్రూట్ చేయడం లేదన్నారు.విద్యార్థులు మానసికంగా ఉండడానికి వారితో ఆటలాటించడం లేదు.కొన్ని పాఠశాలలకైతే ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.ఫీజుల నియంత్రణ విషయానికి వస్తే ప్రైవేట్ యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించే ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేయకూడదని 1994ఏర్పాటు చేసిన జీఓ నెంబర్ 1లో స్పష్టంగా తెలియజేసిన కూడ ఏమాత్రం పాటించకుండా ఈ ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ చేసుకునే క్రమంలో ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తూ విద్య హక్కు చట్టానికి విరుద్ధంగా స్క్రీనింగ్ టెస్ట్ లు తల్లిదండ్రులు ఇంటర్వ్యూల ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్ చేసుకుంటున్నారని మండిపడ్డారు.తమ పిల్లలకు మంచి విద్యను అందించాలన్న తల్లిదండ్రులు కోరికను మంచి అవకాశంగా భావించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమవసూలు పాల్పడుతున్నారు.కాబట్టి తక్షణమే ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలలో ఫీజులు వసూలుపై జిఓ నెంబర్ 1లోని సెక్షన్ -11 ప్రకారం గవర్నింగ్ బాడీ చేసేలా చర్యలు తీసుకోవాలని,ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, విద్యావేత్తలు,జిల్లా కలెక్టర్,జడ్జి కమిటీ సభ్యులుగా ఉన్న వారితో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్,జిల్లా సహాయ కార్యదర్శి అంజి, నగర నాయకులు ఆర్యన్,పృథ్వి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment