విలేకరిపై దాడి హేయమైన చర్య... దుండగులను కఠినంగా శిక్షించాలి...
జర్నలిస్ట్ కు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) అండ..
మధుసూదన్,కల్లూరు మండలం అధ్యక్షులు...
VS9TV న్యూస్,కల్లూరు :
కర్నూలు జిల్లా,దేవనకొండ మండలం, పల్లె సాక్షి పత్రిక విలేఖరి భీమలింగడుపై గత కొద్దిరోజుల క్రితం దాడి చేసిన ఎర్రమట్టి మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం(UJF) కల్లూరు కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు తహసీల్దార్ కె. ఆంజనేయులు ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా మండలం అధ్యక్షులు మధుసూదన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా,ఆలూరు నియోజకవర్గం,దేవనకొండ మండలం, కరిడికొండ గ్రామకొండ ప్రాంతాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న సమాచారం తెలుసుకొని ఎర్రమట్టి మాఫియాను ప్రశ్నించి, అడ్డుకోవడానికి వెళ్లిన పల్లె సాక్షి పత్రిక విలేఖరి భీమలింగడుపై ఉద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా భయభ్రాంతులను గురిచేసేలా ఎర్రమట్టి మాఫియా,జెసిబి యజమాని కన్నప్పలు విలేకరిపై పిడుగుద్దులు,ఇనుపరాడ్ లు, పదునైన ఆయుధాలతో హత్య చేయడానికి కుట్రకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వ,ప్రజల ఆస్తులను అక్రమంగా దోపిడీ చేస్తున్న వారి అక్రమాలను తమ పత్రిక ద్వారా ప్రభుత్వానికి ప్రజల్లో తీసుకువెళ్లడానికి చైతన్యపరిచిన మల్ల సాక్షి పత్రిక భీమలింగడుపై అత్యాయత్నం చేసిన మట్టి మాఫియా దుండగులపై ప్రభుత్వం తక్షణమే పూర్తి విచారణ జరిపించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగలరని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం(UJF) మండల కమిటీ ఆధ్వర్యంలో కోరుతున్నట్లు చెప్పారు.విలేకరులపై నిత్యం ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.సమాజంలో జరిగే వాస్తవాలను ప్రజలకు చేరవేసే మీడియా పత్రిక విలేకరులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.ప్రభుత్వాలు ఇప్పుడైనా గుర్తించి చట్టపరంగా మీడియా మిత్రులపై దాడులు చేసే వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని తెలియజేశారు. విలేకరులపై దాడి సమయంలో వారికీ న్యాయం జరిగేవరకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం(UJF) అండగా పోరాటం సాగిస్తామని నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా విలేకరులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటం ఉదృతం చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో యూజెఎఫ్ మండల కమిటీ ఉపాధ్యక్షులు వై.వి.రెడ్డి,ప్రధాన కార్యదర్శి లోకేష్,వజ్రరాజు,చంద్రశేఖర్, జిల్లా యుజెఎఫ్ కమిటీ నాయకులు నీలం సత్యనారాయణ, వి.విజయకుమార్,సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comments
Post a Comment