అంబేద్కర్ స్ఫూర్తితో మతోన్మాదుల చేతి నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం...ప్రజా సంఘాల నాయకులు...

VS9TV న్యూస్,కల్లూరు :

కర్నూలు నగరం,32వ వార్డు,ముజాఫర్ నగర్,కెవిపిఎస్ వార్డు అధ్యక్షులు ఇ. రామాంజనేయులు అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎస్ రాధాకృష్ణ, నగర కార్యదర్శి యం.భాస్కర్,సిఐటియు నాయకులు కె.సుధాకరప్ప,ఐద్వా, డివైఎఫ్ఐ నగర కార్యదర్శులు జి.ధనలక్ష్మి,యస్.హుస్సేన్ భాష,కెవిపీఎస్ నగర నాయకులు ఎం.సీ.ఆనంద్ మాట్లాడుతూ 1891,ఏప్రిల్, 14న మౌ అనే గ్రామంలో జన్మించిన అంబేద్కర్ తన చిన్నతనంలోనే చదువుకునే రోజుల్లోనే చదువు కోసం స్కూలు బయట ఒంటరిగా కూర్చోబెట్టి వారణి అప్పుడే ఆయన వివక్షకు గురయ్యాడని వారు తెలిపారు. అయినా పట్టు వీడని విక్రమార్కుడిలా ఉన్నత స్థాయి చదువులు చదువుకొని దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు.సమాజంలో కుల,మత,ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలందరూ సమానత్వంగా బతకాలని కోరుకున్న నాయకుడని,దళితుల పట్ల పెత్తందార్ల వివక్షకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపి కుల,మతాలతో సంబంధం లేకుండా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ పోరాడాడు అన్నారు. దేశంలో సమానత్వం కోసం మన దేశానికి ప్రజలకు కావలసిన గూడు కూడు గుడ్డ విద్యా వైద్యం లాంటి అనేక అవసరాలను తీసుకొని దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించిన ఘనుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు.ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుందని,ఎటువంటి కుల,మత ప్రాంతీయ భేదాలు లేకుండా అన్నదమ్ములలాగా కలిసి బతికే భారత ప్రజల మధ్య రాజకీయ లబ్ది పొందడం కోసం,వారి మద్య హిందుత్వ అజెండా అమలు చేసుకోవడం కోసం మతం పేరుతో గొడవలు సృష్టించి బ్రిటిష్ వారిలా విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తుందని విమర్శించారు. దేశాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేసి రోజురోజుకు ప్రజలపై మోయలేని భారాలు వేస్తుందని తెలిపారు.దేశంలో మధ్యతరగతి, పేద ప్రజల బతుకులు భారంగా మారాయని అన్నారు.భవిష్యత్తులో అంబేద్కర్ స్ఫూర్తితో మతోన్మాదానికి,కార్పొరేట్ వ్యవస్థకు, రోజురోజుకి ప్రజలపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ప్రజలందరూ సిద్ధం కావాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీఎస్ నగర నాయకులు కె.సురేష్, యం.శ్రావణ్ కుమార్,బి.చిన్న, యం.దావీదు, మాదన్న,ప్రసాద్,యస్.ముక్తియార్, వెంకటేశ్వర్లు,రాజు,బీసన్న,కాసిం,ఓబుల్ రాజు,మహిళా సంఘం నాయకులు కె.దానమ్మ,జె.లక్ష్మిభాయ్, కెవియన్ కన్యక, కె.సువార్త,టి.ఈశ్వరమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...