సెస్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న నిధులను గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగించాలి...వల్లూరు శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్...

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

సెస్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న నిధులను గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్ అన్నారు.ఆదివారం స్థానిక ఎస్టియు భవన్ లో,అరసం జిల్లా అధ్యక్షులు కలం ప్రహ్లాద అధ్యక్షతన గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక సదస్సు ఏర్పాటుచేశారు.
సదస్సుకు హాజరైన ఆయన ప్రసంగిస్తూ... స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిలించడానికి,సామాజిక స్పృహను పెంచడానికి,మానవీయ విలువలను పెంపొందించడానికి,అశాస్త్రీయ భావాలను తొలగించడానికి ప్రజలకు అవగాహన కలిగించడంలో గ్రంధాలయ ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు.నేడు గ్రంథాలయాలు ఆదరణకు నోచుకోక నిర్వీర్యమైన స్థితిలో ఉన్నాయని ఆవేదన చెందారు.గ్రామ గ్రామాన గ్రంథాలయాలను పునరుద్దరించాలని,ఖాళీగా ఉన్న గ్రంథాలయ ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్, 27వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు.ఈ సదస్సుకు భాషా సాహితీ అభిమానులు అందరూ రావాలని పిలుపునిచ్చారు. చంద్రశేఖర కల్కురా,జే.ఎస్.ఆర్.కే శర్మలు మాట్లాడుతూ గ్రంథాలయాల పునరుద్ధరణకు అన్ని భాషాసాహితీ సామాజిక సంస్థలు ఒకే తాటిపై నిలబడి పోరాడాలన్నారు.ఊరూరా విజ్ఞానాన్ని పంచుతూ కళకళలాడిన గ్రంథాలయాలు నేడు కనుమరుగైపోవడం చాలా విచారకరమన్నారు.గ్రంథాలయాల అభివృద్ధికి చేయబోయే పోరాటంలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు. అనంతరం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలు అందుకున్న డాక్టర్ ఎం.హరికిషన్,ఎస్.డి.వి.అజీజ్,జిల్లా ఉగాది పురస్కారం అందుకున్న దాసరి వెంకటరమణను అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి,పుస్తకాలను బహూకరించారు.ఈ కార్యక్రమంలో ఎం హరికిషన్,మారుతి పౌరోహితం,ఎస్.డి.వి.అజీజ్,డీఎస్పీ మహబూబాషా,ఇనయతుల్లా,కొత్తపల్లి సత్యనారాయణ, ప్రమోద్ చక్రవర్తి,ఆదవాని హనుమంతప్ప,బాలశౌరి,చక్రపాణి యాదవ్,రాణి,లీలావతి,చంద్రమౌళిని తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...