విజయవాడలో రోహింగ్యాల కలకలం...పోలీసుల అదుపులో 15మంది...

విజయవాడలో రోహింగ్యాల కలకలం
పోలీసుల అదుపులో 15 మంది
హైదరాబాద్‌ నుంచి వచ్చి తాడిగడపలో నివాసం
వివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పని

VS9TV న్యూస్,విజయవాడ క్రైం :

విజయవాడ శివారులోని తాడిగడపలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి వచ్చిన సమాచారంతో విజయ వాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగర శివారులోని మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి మొ త్తం 15మంది అక్రమ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని విజయవాడకు తరలించారు.వివరాలు...తాడిగడపలోని ఓ ఇంటిని శుక్రవారం ఉదయాన్నే పోలీసులు చుట్టుముట్టారు.ఆ ఇంట్లో ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.వారు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? వారి కోసం ఎవరెవరు వస్తు న్నారు? అని ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. తనకు పరిచయస్థుడైన ఓ వ్యక్తి ఆటోనగర్‌లో భవనం నిర్మిస్తున్నానని, అక్కడ పని చేస్తున్న ఓ మహిళకు,పురుషుడి కి పోర్షన్‌ అద్దెకు కావాలని కోరడంతో ఈనెల 9న అద్దెకు ఇచ్చానని యజమాని తెలిపా రు.అయితే ఆమె గత ఆదివారమే వెళ్లిపోయింది.పురుషుడు ఒక్కడే ఉంటున్నాడని,గురు వారం అర్ధరాత్రి దాటాక మరో ఏడుగురు యువకులు వచ్చి ఆ ఇంట్లో ఆశ్రయం పొందారని తేలింది.మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదే క్రమంలో తాడిగడప 100అడుగుల రోడ్డులోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో పనిచేస్తున్న ఇద్దరిని,గోశా ల వద్ద ఓ అపార్ట్‌మెంట్‌ పనుల కోసం వచ్చిన ఐదుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.వీరు గత ఆరు నెలలుగా ఇక్కడే పని చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారిం చారు.

పూర్వాపరాలపై విచారణ : 

మయన్మార్‌ నుంచి అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన వీరు కొంతకాలంగా హైదరాబా ద్‌లో నివాసం ఉంటున్నారు.అక్కడి నుంచి విజయవాడ చేరుకొని భవన నిర్మాణ కార్మికు లుగా పని చేస్తున్నారు.వీరందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు,కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.వారికి ఎలాంటి తీవ్రవాద మూలాలు లేవని ప్రాథమికంగా నిర్ధారణ కు వచ్చారు.వీరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఉన్నతాధికారుల తో చర్చలు జరుపుతున్నారు.వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్‌లో నివసిస్తుంటారు. కానీ అక్కడ సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకుగానూ లక్షలాది రోహిం గ్యాలు 2017లో బంగ్లాదేశ్‌కు తరలిపోయారు.మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు అనం తరం వారి వలసలు మరింత పెరిగాయి.దీంతో దక్షిణ బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి.అక్కడి పరిస్థితులూ క్షీణించడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయేందుకు వలసబాట పడుతున్నారు.ఈ క్రమంలోనే కొందరు మన దేశానికి అక్రమం గా వలస వచ్చి పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...