పిల్లలు పుట్టడం లేదని కోడలి హత్య....రాళ్లతో దాడి చేసిన అత్త...గొంతునులిమిన మామ...

పిల్లలు పుట్టడం లేదని కోడలి హత్య

రాళ్లతో దాడి చేసిన అత్త,

గొంతునులిమిన మామ
VS9TV న్యూస్,కర్ణాటక :

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని తమ కోడలిని అత్త,మామలే హత్య చేయడం సంచలనంగా మారింది. అందులోనూ ఈ హత్యను కట్టుకున్న భర్తే ప్లాన్ చేయడం మరింత హాట్ టాపిక్‌ గా మారింది.హత్య చేసిన తర్వాత దానిని రోడ్డు ప్రమాదంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించారు.పూర్తి వివరాల్లోకి వెళితే...మహారాష్ట్రలోని సతారాలో సంతోష్ మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి విజయపుర జిల్లాలోని చడచన్‌‌కు చెందిన రేణుకతో 2020లో వివాహం జరిగింది.ఇరు కుటుంబాలు ఆర్థికంగా స్థిరమైనవి.అయితే వివాహం తర్వాత నుంచే వివిదాలు,సమస్యలు మొదలయ్యాయి.దీంతో భార్య,భర్తలు కొన్ని ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు. రేణుక ఆరోగ్య సమస్యలు,గర్భం దాల్చకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మరింత రేగాయి.దీంతో రేణుకను హత్య చేసేందుకు అత్త,మామలు జయశ్రీ,కామన్న,కొడుకు సంతోష్ ప్లాన్ వేశారు.దాని ప్రకారమే...మే 18న అత్త జయశ్రీ,మామ కామన్న కోడలు రేణుకను రాత్రిపూట గుడికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికి వచ్చే సమయంలో హత్య చేశారు.బైక్‌పై వెళ్తున్న సమయంలో అత్త జయశ్రీ...రేణుకను కిందికి తోసేసింది.ఆపై పక్కనే ఉన్న రాళ్లతో దాడి చేసింది.మామ కామన్న సైతం రేణుక గొంతు నులిమి హత్య చేశాడు.దీనిని ప్రమాదంగా చిత్రీకరించాలని..బైక్ టైర్‌లో రేణుక చీరను పెట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లారు. అయితే ఈ ఘటన పోలీసుల వరకు వెళ్లడంతో వారు తమదైన శైలిలో విచారించారు.కేవలం రేణుకకు మాత్రమే గాయాలు ఉండటం... మిగిలిన ఇద్దరికి గాయాలు లేకపోవడంతో అనుమానం వచ్చి విచారించారు.ఈ విచారణలో అత్తా మామ హత్య చేసినట్లు అంగీకరించారు.అలాగే తమ కుమారుడు సంతోష్...రేణుకను చంపడానికి తమను ప్రేరేపించాడని తెలిపారు.దీంతో ముగ్గురుని హిండల్గా జైల్లో వేశారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే...రేణుకతో విడిగా ఉన్నపుడే సంతోష్ మరో వివాహం చేసుకున్నాడు.రెండో భార్య గర్భం దాల్చడంతో హత్యకు చివరి కారణం కావచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.రేణుకకు పిల్లలు లేకపోవడం కారణాల వల్ల చాలా కాలంగా వేధింపులకు గురవుతోందని పోలీసులు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...