సమసమాజ స్థాపనకు పాటుపడిన చిరస్మరనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య...ఎం.ఎ.గఫూర్,సిపిఎం మాజీ కేంద్ర కమిటి సభ్యులు...

సమసమాజ స్థాపనకు పాటుపడిన చిరస్మరనీయుడు 
పుచ్చలపల్లి సుందరయ్య
ఎం.ఎ.గఫూర్,సిపిఎం మాజీ కేంద్ర కమిటి సభ్యులు

మన న్యూస్,కర్నూలు కార్పొరేషన్ :

సమ సమాజ స్థాపనకు పాటుపడిన చీరస్మరణీయుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సిపి ఎం మాజీ కేంద్ర కమిటి సభ్యులు ఎం.ఎ.గఫూర్ అన్నారు.సోమవారం ఇందిరాగాంధీ నగ ర్ లోని సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో న్యూసిటీ కార్యదర్శి టి. రాముడు అధ్యక్షతన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా ని ర్వహించారు.ముందుగా పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాజీ కేంద్ర కమిటీ స భ్యులు ఎం.ఎ.గఫూర్ మాట్లాడారు.సుందరయ్య చిన్నతనం నుండే ప్రజా ఉద్యమాల్లో పా ల్గొన్నట్లు చెప్పారు.15ఏళ్ళ వయసుకే ఉప్పు సత్యాగ్రహం పోరాటంలో పాల్గొని జైలు జీవితం అనుభవించిన త్యాగశీలి అని కొనియాడారు.పెట్టుకున్న లక్ష్యాన్ని ఆదర్శవంతమై న జీవితం గడిపాడని చెప్పారు.ప్రతి నాయకుడికి వ్యక్తిగత జీవితంలో ప్రసంగాల కన్నా ఆ చరణ ముఖ్యం అని సూచించారు.సమాజమే నా పిల్లలు అని ఆలోచించిన సుందరయ్య తమకు పిల్లలు కలగకుండా త్యాగం చేశాడని అన్నారు.తుదిశ్వాస వరకు సమసమాజ స్థాపన ఏర్పాటుకు పాటుపడినట్లు చెప్పారు.

బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తుందని చెప్పారు.ప్రస్తుత సమాజంలో రాజకీయాలను ఉపయోగించుకొని ప్రజాభిమాణాన్ని కొల్లగొట్టడం పనిగా పెట్టుకున్నారన్నారు.ఓట్ల సమయంలో డబ్బులతో ఓట్లు కొనడంతో అధికారం చేయబ డుతున్నారని దుయ్యబడ్డారు.ముస్లింలను శత్రువులుగా చూస్తూ ఉన్నారని ప్రజల్లో ఐక్యత ను దెబ్బ తీస్తున్నారన్నారు.ప్రజలను చైతన్యం చేసి,ప్రజలను ఐక్యం చేసి ప్రభుత్వ విధానా లకు వ్యతిరేకంగా పోరాటాల సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.కావున సుందరయ్య ఆశ యాలు సాధించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.సిపిఎం కార్య దర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సుందరయ్య జీవితం ఆదర్శనీయం అన్నా రు.తాను 13ఏళ్ళ వయసు నుండి తుది శ్వాస వరకు ప్రజల కోసం పాటుపడిన నాయకు డు అని కొనియాడారు.పార్లమెంట్ లో సభ్యులు అందరు సుందరయ్య ప్రసంగం కోసం ఎ దురుచూసిన పరిస్థితి నాడు ఉండేదన్నారు.నేడు బిజెపి ప్రభుత్వం భారతదేశ సమైక్యతను దెబ్బతీస్తూ మతం వైపు తీసుకువెళుతోంది.కార్పొరేట్ లకు అనుకూలంగా విధానాలు అమ లు చేస్తుందన్నారు.వాటికి వ్యతిరేకంగా పోరాటాల్లోకి రావాలని చెప్పారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నారన్నారు.ప్రశ్నించే వారిని జైల్లో పె డుతున్నారు అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఆయన చూపిన మార్గంలో ప్రతి నాయకుడు ప్రజలలో ఉంటూ వారి శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు.అప్పుడే సుందరయ్య ఆశించిన లక్ష్యం నెరవే రుతుందన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ అ ఖిలభారత మహాసభలలో తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో తీసుకురావాలని అన్నారు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం మరో పోరాటం చేసే సాధించుకోవాలన్నా రు.సోషల్ మీడియాలో ఉపయోగించుకొని లౌకిక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లా లన్నారు.స్మార్ట్ మీటర్లు పన్నుల భారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సూచిం చారు.బి.జె.పి.కి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం ద్వారానే సుందరయ్యకు ఘ నమైన నివాళి అర్పించినట్లున్నారు.సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల మాట్లాడు తూ మహిళలపై హింసతో పాటు అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు.వాటిని అరికట్ట డం లేదన్నారు.సుందరయ్య భార్య లీలమ్మ కూడా ఆయనకు ఎందుకన్నుగా ఉందన్నారు. అందరూ భారతీయులైనన్న భావనను పెంపొందించేందుకు కృషి చేయాలని చె ప్పారు. సభకు ముందుగా ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో కళాకారులు ఆలపించిన గేయాలు అమరజీవి సుందరయ్య,వీరులారా...సూరులారా,జోహార్ జోహార్ సుందరయ్య ,నీలాంటి త్యాగధనులు,ఆశయాల బాటల్లో ఎన్నో వసంతాలు,ప్రదర్శించిన నృత్య రూప కాలు రెడ్ సెల్యూట్,విప్లవ నేత సుందరయ్యకు పోరు దండాలు ఇలాంటి పాటలు,నృత్య రూపకాలు ప్రజలను ఆకార్షించాయి.ఈ కార్యక్రమంలో సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్, సిఐ టియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్.రాధాకృష్ణ,జి.రామకృష్ణ,కె.వి.నారాయణ,ఆనంద్ బాబు, హుసేనయ్య,కృష్ణ,నాగన్న,నాయకులు,మహిళలు,ప్రజా నాట్యమండలి కళాకారులు,పా ల్గొన్నారు.



Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...