పెరుగుతున్న కరోనా కేసులు...టూరిస్టులు జాగ్రత్త
VS9TV న్యూస్,న్యూఢిల్లీ :
ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే...సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే విస్తృతంగా వ్యాపిస్తోంది కరోనా.సింగపూర్ లో ఈ ఏడాది ఇప్పటికే 14వేలకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.ఇది గత ఏడాది కంటే 28 శా తం అధికమని తెలుస్తోంది.సింగపూర్ సహా..చైనా, హాంగ్ కాంగ్,థాయిలాండ్, సౌత్ ఈ స్ట్ ఏసియాలో వేగంగా వ్యాపిస్తోంది కరోనా.ఆయా దేశాల్లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.చైనాలో గత సంవత్సరం వేసవి కాలంతో పోల్చితే..ఈ ఏడాది నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని తెలుస్తోంది.ఏప్రిల్ నెలలో జరి గిన సాంగ్ క్రాన్ ఫెస్టివల్ తర్వాత థాయిలాండ్ లో కరోనా వ్యాప్తి పెరిగినట్లు తెలుస్తోం ది.కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో జనాల్లో లాక్ డౌన్ భయం మళ్ళీ మొదలైం ది.అయితే,కొత్త మ్యూటెంట్ అంత ప్రమాదమేమీ కాదని...ఇప్పటిదాకా ఈ వైరస్ సోకిన వారిలో స్వల్ప అనారోగ్యం మినహా పెద్దగా లక్షణాలేవీ కనిపించలేదని చెబుతున్నారు వై ద్యులు.
వేగంగా వ్యాపిస్తున్న దేశాలు :
హాంకాంగ్ : హాంగ్ కాంగ్ లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.కోవిద్ టెస్ట్ లో పాజిటివ్ గా నమోదవుతున్నవారి సంఖ్య మార్చిలో 1.7శాతం ఉండగా మే నెలలో ఇ ది 11.4శాతం అయ్యిందని అధికారులు తెలిపారు.2024,ఆగస్టు కంటే ఇది అధికం. హాంగ్ కాంగ్ లో ఇప్పటిదాకా 81మందికి తీవ్ర లక్షణాలు కనిపించగా 30మంది మరణిం చినట్లు పేర్కొన్నారు.వీరిలో ఎక్కువ మందికి ముందుగానే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు చెప్పారు.
సింగపూర్ : సింగపూర్ లో మే నెలలో కరోనా వ్యాప్తి 28శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 14వేలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.కరోనా లక్షణాలతో ఆసుపత్రు ల్లో చేరుతున్నవారి సంఖ్య 30శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
చైనా : చైనాలో కూడా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.గత వేసవితో పోల్చితే ఈ ఏడాది నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.ఇటీవల నిర్వహిం చిన పరీక్షల్లో పాజిటివ్ గా నమోదవుతున్న కేసుల సంఖ్య రెట్టింపయ్యిందని తెలిపారు అధికారులు.
ఆందోళన,భయం :
ఆయా దేశాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో మళ్ళీ లాక్ డౌన్ తప్పదా అనే భ యం చాలామందిలో మొదలైంది.వాస్తవానికి ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ అంత ప్ర మాదకరమైనది కాదని చెబుతున్నారు డాక్టర్లు.ముందుగా అనారోగ్య సమస్యలతో బాధప డుతున్నవారిపై మాత్రమే తీవ్ర ప్రభావం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Comments
Post a Comment