వనస్థలిపురంలో దారుణం...భర్తను హత్యచేసిన భార్య...ప్రమాదవశాత్తూ ఇంట్లో కింద పడి చనిపోయాడని నమ్మించే యత్నం...
వనస్థలిపురంలో దారుణంభర్తను హత్యచేసిన భార్యప్రమాదవశాత్తూ ఇంట్లో పడి చనిపోయాడని నమ్మించే యత్నం
VS9TV న్యూస్,హైదరాబాద్ క్రైం :
ఇంట్లో గొడవల కారణంగా భర్తను నెట్టివేస్తే కింద పడిన వెంటనే భార్య తన చున్నితో గొంతునులిమి హత్యచేసిన ఘటన జరిగింది. వివరాలు...వలిగొండ మండలం,గోకారం గ్రామానికి చెందిన నెలగంటి శిరీష (28)ను యాదాద్రి భువనగిరి జిల్లా,నారాయణపురం సభవత్ తండాకు చెందిన కిషన్ నాయక్ (40) ఎనిమిది సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు.గత కొన్ని రోజులుగా ఇరువురికి తగాదాలు జరుగుతున్నట్లు సమాచారం.దీంతో భర్త కిషన్ నాయక్ ను వదిలి శిరీష వనస్థలిపురం హిల్స్ కాలనీలో ఒంటరిగా జీవనం చేస్తోంది.పథకం ప్రకారం భర్తనుభార్య శిరీష ఇంటికి పిలిచి చున్నీతో ఉరివేసి హత్య చేసింది.కూతురు బిందు (19) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసుల విచారణలో హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల దర్యా ప్తులో శిరీష మొదటగా తన భర్త ప్రమాదవశాత్తూ ఇంట్లో పడి చనిపోయాడని నమ్మించే యత్నం చేసింది.కాని పోలీసులు తమ శైలిలో విచారణ చేయగా శిరీష ప్రణాళికతో హ త్యకు పాల్పడినట్లు గుర్తించారు.ఈ కేసులో శిరీషతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీ సుకుని పోలీసులు పూర్తి విచారణ ప్రారంభించారు.
Comments
Post a Comment