ఈడీ,మోడీలకు బెదిరేది లేదు...ఉదయనిధి స్టాలిన్‌,తమిళనాడు డిప్యూటీ సీఎం...

ఈడీ,మోడీలకు బెదిరేది లేదు
ఉదయనిధి స్టాలిన్‌,తమిళనాడు డిప్యూటీ సీఎం

VS9TV న్యూస్,తమిళనాడు :
ప్రధాని మోడీ,కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలను చూసి డీఎంకే భయపడదని ఉదయనిధి వ్యాఖ్యానించారు. తమపై పెట్టే కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామని ఆయన తేల్చి చెప్పారు.తమిళ నాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ…‘రా ష్ట్ర ప్రజల హక్కుల కోసం డీఎంకే పోరాటం కొనసాగిస్తుందని,ఎలాంటి బెదిరింపులకైనా భయపడబోదని చెప్పారు.తాత,మాజీ సీఎం కరుణా నిధి పెంచి పోషించిన డీఎంకే, హే తువాది పెరియార్‌ బోధించిన ఆత్మ గౌరవ నినాదానికి కట్టుబడిన పార్టీ అని ఆయన వ్యా ఖ్యానించారు.నిధి హక్కులు అడిగేందుకే ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లా రన్నారు.ఇదే సమయంలో ప్రతిపక్షనేత ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని విమ ర్శించారు.ఎవరో బెదిరిస్తే భయపడిపోయే పాలన తమది కాదన్నారు.తాము ఏ తప్పూ చేయలేదని,భయపడాల్సిన అవసరం లేదన్నారు.ఏదైనా చట్టపూర్వకంగా ఎదుర్కొంటా మని తెలిపారు.టాస్మాక్‌ పై ఈడీ దాడుల నేపథ్యంలో ఢిల్లీలో జరిగే నీతిఆయోగ్‌ సమావే శానికి వెళ్లేందుకు సీఎం స్టాలిన్‌ తొందరపడుతున్నారంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే చేసిన వ్యాఖ్యలపై పైవిధంగా స్పందించారు.గత కొంతకాలంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం పోరాడుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన,హిందీ భాష తప్పనిసరి చేస్తూ కేం ద్రం తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...