పన్నుల పేరుతో చెల్లిస్తున్న ప్రజల కష్టార్జితం నేల పాలు...శంకుస్థాపనలు,శిలాఫలకాలకు పరిమితం...

పన్నుల పేరుతో చెల్లిస్తున్న

ప్రజల కష్టార్జితం నేల పాలు

శంకుస్థాపనలు,శిలాఫలకాలకు పరిమితం

పనులు మధ్యలో నిలిపీవేత 

ఒక పార్కు నిర్మాణానికి రూ.1.17 కోట్లు 

ఏమయ్యాయి?

ప్రజాధనం వృధాను పట్టించుకోని పాలకవర్గం

కూటమి ప్రభుత్వం స్పందించాలి

పట్టణ పౌర సంక్షేమ సంఘం

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరాభివృద్ధి కోసం నగరపాలక సంస్థ పాలకవర్గం కోట్లాది రూపాయలు మంజూరు చేయడం.అధికారులు టెండర్ పిలవడం,పాలకవర్గం ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేయడం,శిలాఫలకాలు వేయడం,పనులు ప్రారంభించి మధ్యలో వదిలేయడం వల్ల పన్నుల రూపంలో చెల్లించిన ప్రజల కష్టార్జితం కోట్ల రూపాయలు నేల పాలవుతున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లా రెడ్డి,వివిధ కాలనీల ప్రతినిధులు ఎస్.కె.అస్లాం భాష,బి.వి.రమణ,ఏ.అసరఫ్ జానీ వి మర్శించారు.ఆదివారం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి పాత నగరంలో పర్యటించింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత నగ రంలో అధిక జనాభా ఉన్నప్పటికీ పార్కులు అందుబాటులో లేవన్నారు.పెద్దమార్కెట్ సమీపంలో ఉన్న పార్కు అభివృద్ధికి కోటి రూపాయలకుపైగా ఖర్చు చేసినప్పటికీ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.2010లో ఒకసారి,2022లో ఒకసారి శిలా ఫలకాలు శంకుస్థాపనలు చేశారని తెలిపారు.2022లో రూ.1.17కోట్లతో శంకు స్థాపన,శిలాఫలకం వేసి పని ప్రారంభించి మధ్యలో నిలిపేసారని తెలిపారు.ఆ నిధు లు ఏమయ్యాయని ప్రశ్నించారు.జరిగిన పనులన్నీ కూడా నాసిరకంగా ఉన్నాయని అన్నారు.చిన్నపిల్లల ఆడుకునేందుకు ఏర్పాటుచేసిన క్రీడా పరికరాలు కొన్ని నెలలకే శిథిలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.నగరంలో అనేక చోట్ల మంజూరైన పను లు మొదలు పెట్టలేదు. కొన్ని పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారని,ఇంత జ రుగుతున్నా...పాలకవర్గం పట్టించుకోకు పట్టించుకోవడంలేదని అన్నారు. పాలకవ ర్గం పట్టించుకోకపోవడం కాంట్రాక్టర్లు.. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తు న్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకొని టెండర్ లైన అభివృద్ధి పనులను ప్రారంభించి,మధ్యలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చే యాలని,ప్రజాధనాన్ని కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఉ జేర్ హహ్మద్,ఎస్.రమణ గౌడ్,ఎస్.మబ్బుల్,నాసిర్ అహ్మద్ ఖాన్,చిత్తారు వెంకట వ ర్మ,ఎస్.మున్నా,ఎస్.అబ్దుల్లా పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...