యోగా సాధన ద్వారా ఆరోగ్యం... ఎస్.రవీంద్రబాబు,నగరపాలక కమిషనర్...

యోగా సాధన ద్వారా ఆరోగ్యం
ఎస్.రవీంద్రబాబు,నగరపాలక కమిషనర్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
యోగా సాధన ద్వారా ఆరోగ్యం లభిస్తుందని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ర వీంద్రబాబు పేర్కొన్నారు.మంగళవారం యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా కర్నూలు అవుట్ డోర్ స్టేడియం నుండి కొండారెడ్డి బురుజు వరకు నిర్వహించిన మాస్ ర్యాలీని నగ రపాలక సంస్థ కమిషనర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లా డుతూ యోగాను అందరికీ అందించాలి అనే బృహత్తరమైన ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.జూన్,21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా ఈ సంవత్సరం మన రాష్ట్రంలో ప్రధానమంత్రి సమక్షంలో విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో ఐదు లక్షల మందితో ఒకే సమయంలో ఒకే వేదికపై సాధన చేస్తూ ఒక ఈవెం ట్ ఏర్పాటు చేస్తున్న శుభసందర్భంలో దానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిని గ్రామాలు,పట్ట ణాలు,నగరాలు, కార్పొరేషన్లు అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉన్నది. యోగ కార్యక్రమంలో భాగంగా ఒక నెల రోజులపాటు యోగపై అవగాహన, అభ్యాస కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికను కూ డా ప్రకటించిందని,మే,21వ తేదీ కర్టన్ రైజర్ తో ఈవెంట్ ను ప్రారంభించుకోవడం జరి గిందన్నారు.రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు కర్నూలు నగరంలో కూడా మే,21 తారీఖున ప్రజలందరిని భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాలను ప్రారంభించుకున్నా మన్నారు.ఈ నెల రోజులలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా యోగపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.నేడు చిన్నారులను,పెద్దలను,వయోవృద్ధులను, ఉద్యోగు లు,వ్యాపారస్తులు,తదితర అన్ని వర్గాల వారిని అందరిని భాగస్వాములు చేస్తూ ఒక మెగా ర్యాలీని కూడా నిర్వహించుకుంటున్నామన్నారు. జిల్లాలో యోగా గురువుల చేత మాస్టర్ ట్రైనర్స్ కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందని,అన్ని మండలాలకి,మున్సిపల్ కార్పొరేషన్ లకి,మాస్టర్ ట్రైనర్స్ ను పంపించడం జరుగుతుంది.ఈరోజు నుండి ఐదు రోజులపాటు ఈ మాస్టర్ ట్రైనర్స్,ప్రణాళిక బద్ధంగా ఐదు రోజులపాటు ట్రైనర్స్ కు శిక్షణ కూడా ఇస్తున్నారని అన్నారు.ఈ ట్రైనర్స్ కు తర్ఫీదు ఇచ్చి వారి ద్వారా జూన్ రెండో తారీకు నుండి మరో ఐదు రోజులపాటు వారి వారి ప్రాంతాల్లో గ్రామా పంచాయితీ లలో,వార్డులలోని,ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసిందని అన్నారు.ప్రభుత్వం తలపెట్టిన మం చి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.యోగా అన్నది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం అన్నారు.ఇది భారతీయులు కనుగొన్నటువంటి ఒక గొప్ప నైపుణ్యమైన విద్య.దీన్ని ప్రపంచ ప్రజలందరికీ పరిచయం చేస్తూ 10సంవత్సరాల ముందుగానే అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రజలందరికీ తెలియజేసేలా చేయడం జరి గింది.దానిలో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్,21వ తేదీన ప్రకటిం చడం జరిగిందన్నారు.2025,జూన్,21వ తేదీన నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యోగా ను ప్రతి ఒక్కరు నేర్చుకొని అభ్యాసం చేసుకుంటే వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్ఓ రాజా రఘువీర్,సెట్కూర్ సీఈఓ డాక్టర్ వేణు గోపాల్,డిఎస్డిఓ భూపతి రావు,డి ఆర్డిఎ...పీడీ రమణారెడ్డి,రాష్ట్ర యోగా సంఘం కార్యద ర్శి అవినాష్ శెట్టి,ఫిషరీస్ ఏడి రంగనాథ్ బాబు,ఇతర జిల్లా అధికారులు,విద్యార్థులు,ప్రజ లు తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...