ఉగ్రవాదాన్ని ప్రతిఘటిస్తాం మతసామరస్యాన్ని కాపాడుకుందాం...కర్నూలులో సమైక్యత యాత్ర...సిపిఎం...

ఉగ్రవాదాన్ని ప్రతిఘటిస్తాం మతసామరస్యాన్ని కాపాడుకుందాం
కర్నూలులో సమైక్యత యాత్ర...సిపిఎం

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :

ఉగ్రవాదాన్ని తరిమేద్దాం మతసామరస్యాన్ని కాపాడుకుందాం అని సిపిఎం పార్టీ ఆధ్వ ర్యంలో గురువారం కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ నుండి అంబేద్కర్ సర్కిల్ (పాత బ స్టాండ్) వరకు సమైక్యత యాత్ర నిర్వహించడం జరిగింది.ర్యాలీ అనంతరం  అంబేద్కర్ సర్కిల్ నందు సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం.రాజశేఖర్ అధ్యక్షత వహించిగా,కా ర్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.ప్రభాకర్ రెడ్డి,సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం ఉగ్ర దాడుల తరువాత మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా నరేంద్ర మోడీ ఆయన అనుచర గణం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.గతంలో ఉగ్రవాద దాడులు జరిగిన సందర్భంగా ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని డాంబికాలు పలికిన నరేంద్ర మోడీ ఒక్క టెర్రరిస్టును కూడా సజీవంగా పట్టుకోలేదని విమర్శించారు.ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి అఖిలపక్ష పార్టీ లు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ బిజెపి ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మైనార్టీలపై వ్యతిరేకతను నూరిపోస్తుందని దాని పర్యవసరంగా ఇటీవల కాలంలో ము స్లింలపై 100కుపైగా దాడులు జరిగాయని తెలియజేశారు.

ఉగ్రవాదులు పెహల్గాంలోకి ఎలా వచ్చారో బిజెపి ప్రభుత్వం బయట పెట్టకపోగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల సోదరిగా బిజెపి నాయకులు వర్ణించడం అత్యంత దారుణ మైన విషయమని విచారం వ్యక్తం చేశారు.ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు వస్తే పాకిస్తాన్ పై ఇలాంటి దాడులకు దిగడం బిజెపికి కొత్తేమీ కా దని తెలిపారు.బిజెపి మూడుసార్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దేశంలో అప్పులు పెరిగాయి తప్ప,చిన్న పరిశ్రమ కూడా తీసుకురాలేదని,ఏమాత్రం అభివృద్ధికి ఈ దేశం నోచుకోలేదని అన్నారు.కేవలం మతపరమైన అజెండాతో బిజెపి కాలం గడుపుతుందని దుయ్యబట్టారు.పేహల్గాం దాడుల తర్వాత అఖిలపక్ష పార్టీల మీటింగ్ ఏర్పాటు చేసి పాకి స్తాన్ పై యుద్ధం ప్రకటించిన కేంద్రప్రభుత్వం మూడు రోజుల తర్వాత ట్రంప్ మాటలకు వి లువిచ్చి యుద్ధం విరమించడం అఖిలపక్ష పార్టీలను అవమానించడమేనని బిజెపి ప్రభు త్వంపై నిప్పులు చెరిగారు.రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహ స్యం చేసే విధంగా బిజెపి వైఖరి ఉందని,దానికి చక్కటి ఉదాహరణ భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో జరిగిన రైతాంగ పోరాటాలను అణిచివేయడం,కార్మిక చట్టాలను రూపు మాపి లేబర్ కోడ్లు తీసుకుని రావడమే నని చెప్పుకోవచ్చని తెలియజేశారు.ఈ దేశంలో ఉండే ఖనిజ సంపాదన ఆదానే,అంబానీలకు దోచి పెట్టేందుకే ఆపరేషన్ కగార పేరుతో ఆదివాసీలను,నక్సలైట్లను చంపి అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేందుకేనని విమ ర్శించారు.బిజెపి హయాంలో అభివృద్ధికి నోచుకోని ఈ దేశం ఏమైపోతుందోనని ఆలో చిస్తున్న తరుణంలో అభ్యుదయ వాదులపైన (కల్బుర్గి,ప్రొఫెసర్ సాయిబాబా) రచయితలపై దాడులు చేసి చంపడమే కాక జైలలో నిర్బంధిస్తున్నారని తెలియజేశారు.ఈ దేశ సౌబ్రాతు త్వాన్ని,సార్వభౌమాధికారాన్ని,దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలందరూ ఏకమై ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు.సిపిఎం న్యూసిటీ కార్యదర్శి టి.రాముడు మాట్లాడుతూ ఉగ్రవాదం అంతం ఏమో కానీ,పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోలేకపోతు న్నామని బిజెపి ప్రభుత్వంపై చలోక్తులు విసిరాడు. దండకారణ్యంలో ఆపరేషన్ కగారి పేరుతో ఉద్యమకారులను ఆదివాసీలను చంపి సహజ సంపదను కార్పొరేట్ శక్తులకు దా రా దత్తం చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బిజెపికి తగిన గుణపాఠం ఈ దేశ ప్రజలు చెప్తారని హెచ్చరించారు.ఈ రాష్ట్రంలో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి న తెలుగుదేశం,జనసేనపార్టీలు బిజెపితో అంట కాగితే వీరికి పుట్టగతులు ఉండవని గుర్తు చేశారు.పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏమి మాట్లాడతాడో అతనికి అర్థం కావడం లేదని,సనా తన ధర్మం పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్ర ప్రజలను అశాంతికి గురి చేస్తున్నార ని,మతసామరస్యాన్ని కాపాడడంలో చేయి చేయి కలపకపోతే చంద్రబాబు నాయుడు కి పవన్ కళ్యాణ్ కి ప్రజలుతగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.ఎస్. రాధాకృష్ణ,కె.వి.నారాయణ,ఎం.డి. ఆనంద్ బాబు,సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.విజయ,సి.గురుశేఖర్,ఎన్.అలివేలమ్మ,కె. అరుణమ్మ,వై.నగేష్,అబ్దుల్లా,రాఘవేంద్ర,సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు షరీ ఫ్,రామకృష్ణ,అబ్దుల్ దేశాయ్,సి.హెచ్. సాయిబాబా,కె.సుధాకరప్ప,అర్.నరసింహులు, కె.ప్రభాకర్,నాగస్వాములు జయమ్మ,శ్యామలమ్మ,వేణి,ఎస్ఏ. సుభాన్,కెవిపిఎస్ నగర నా యకులు రమణ,ఎం.భాస్కర్.జి.ఏసు,ఉశేన్ బాషా,శేషాద్రి,వి.శంకర్,జనార్థన్,సి.శ్రీనివా సులు,ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు రాజు,చిట్టెమ్మ,లోకేష్,సుంకన్న,బతుకన్న,త దితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...