కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు...రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటన...పిల్లల చదువుకు హామీఅన్ని విధాలా అండగా ఉంటానని,ధైర్యంగా ఉండాలని సిఎం భరోసా...
కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబురూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటనపిల్లల చదువుకు హామీఅన్ని విధాలా అండగా ఉంటానని,ధైర్యంగా ఉండాలని భరోసా
చిత్తూరు జిల్లా,కుప్పం మండలం,నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు క ట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి,ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయ అని అడిగా రు.పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు.ఈ ఘటనలో పిల్లలు,తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది.ఇటువంటి ఘ టన దురదృష్ణకరమని,ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు.మా నవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారుల కు ఆదేశాలు ఇచ్చానని సిఎం అన్నారు.శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసు కున్నారు.వారిని బాగా చదివించాని సూచించారు.ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అం డగా ఉంటానని...ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.అప్పుల బాధ,ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని తెలుసుకున్న ముఖ్య మంత్రి...అప్పటికప్పుడు ఆమెకు రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్‌లో సిఎం హామీ ఇచ్చారు. ఘటన,తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని,బాధిత కుటుంబానికి అందు బాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు.

Comments
Post a Comment