కర్నూలు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిద్దుదాం...డాక్టర్ కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డిఐజి...

కర్నూలు జిల్లాను మాదక ద్రవ్య 
రహిత జిల్లాగా తీర్చిద్దుదాం
డాక్టర్ కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డిఐజి
పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్
విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పుర స్కరించుకొని గురువారం డ్రగ్స్ వద్దు బ్రో...భవిష్యత్ ముద్దు బ్రో కార్యక్రమంను కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్,జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా,కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డిల ఆధ్వ ర్యంలో నగరంలోని రాజ్ విహార్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.అనంత రం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు.సమావేశానికి కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా,జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు,పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితా రెడ్డి,నగర మేయర్ బి.వై.రామయ్య,ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి హాజరయ్యా రు.
ఈ సందర్బంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి స్ఫూర్తి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా,జిల్లాలలో మాదకద్రవ్యాల నియంత్రణకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని తెలిపారు.బంగారు భవిష్యత్తు కలి గిన యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నిర్వీర్యం చేసుకుంటున్నారని అన్నా రు.ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండటంవల్ల ఒత్తిడిలాంటి పరిస్థితులు ఉండేవి కాదని, ప్రస్తుతం చిన్న కుటుంబాల వల్ల,తల్లి,దండ్రులు ఉద్యోగాలు చేయడం వల్ల,ఒంటరి తనం తో మానవ సంబంధాలు దెబ్బ తిని,యువత ఇలాంటి అలవాట్లకు లోను అవుతున్నారని చెప్పారు.మానవ సంబంధాలు,కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటే,ఇలాంటి అలవా ట్లకు ఆస్కారం ఉండదని డిఐజీ అభిప్రాయపడ్డారు.1960లో రాష్ట్రంలో గంజాయి సాగు మొదలైందని,విశాఖపట్నం,గోదావరి ప్రాంతాల్లో శిలోన్ నుంచి వచ్చిన తమిళ కార్మికులు వారి వెంట తెచ్చుకున్న గంజాయి విత్తనాలతో ఈ సాగు మొదలైందని పేర్కొన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోం దని డీఐజీ వివరించారు.జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ 1989,జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం అవుతున్నాయని,ఇలాం టి డ్రగ్స్ మహమ్మారిని నాశనం చేయకపోతే,మానవాళి మొత్తం నాశనం అయిపోతుం దన్నారు.అందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ రహిత సమాజాన్ని రూపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయన్నారు.డ్రగ్స్ వాడకం వల్ల తాత్కాలిక ఆనందం మాత్రమే ల భిస్తుందని,ఒత్తిడి వల్లో లేక ఆనందం లభిస్తుందనో డ్రగ్స్ వాడి జీవితాలను నాశనం చేసు కుంటున్నారన్నారు.ముఖ్యంగా విద్యార్థులు,యువత డ్రగ్స్ వాడకుండా తల్లిదండ్రులు బా ధ్యత తీసుకోవాలన్నారు.గతంలో చదువుతో పాటు మనసుకు ఉల్లాసం కలిగేలా ఆటలు, సంగీతం ఇలాంటి ఏదో ఒక వ్యాపకం ఉండేదని,ప్రస్తుతం అలాంటివి లేకుండా చదువు మాత్రమే ఉండడం వల్ల విద్యార్థులు ఒత్తిడికిలోనై ఇలాంటి అలవాట్లకు బానిస అవుతున్నా రని,తల్లి,దండ్రులు తమ పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ లో కానీ,క్రీడల లాంటి కార్యక్రమా ల్లో భాగస్వాములను చేస్తే దురలవాట్లకు గురికాకుండా ఉంటారని సూచించారు.రాష్ట్ర ప్ర భుత్వం మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతోం దని తెలిపారు.ఇందులో భాగంగా మాదకద్రవ్యాలను నియంత్రించడం,ప్రజల్లో అవగాహన తీసుకురావడం,మాదకద్రవ్యాలు సేవించే వారికి రిహాబిలిటేషన్,చికిత్స అందించడం కా ర్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.జిల్లాలో ప్రతి నెలా మాదక ద్రవ్యాల నియంత్రణ కో సం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంద న్నారు.ప్రతి పాఠశాలలోనూ,కళాశాలలోనూ విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ, శాశ్వ తంగా బోర్డులను ఏర్పాటు చేసి ప్రతిజ్ఞను రాయించడం జరుగుతోందన్నారు.మత్తు పదా ర్థాలు సరఫరా వినియోగంపై నిఘా ఉంచడం జరుగుతోందన్నారు.ఎక్కడైనా మత్తు పదా ర్థాల సాగు,వినియోగం లాంటివి తెలిసినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచా రం అందించాలని చెప్పారు.మత్తు పదార్థాల బారిన పడకుండా,మంచి నడవడికను అల వర్చుకోవాలని విద్యార్థినీ,విద్యార్థులు యువతకు పిలుపునిచ్చారు.మాదకద్రవ్య రహిత సమా జాన్ని నిర్మించేందుకు మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ కోరారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వ్యసనాన్ని మొగ్గలోనే త్రుంచి వేయా లని సూచించారు.యువత,కాలేజీ విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.ఎక్కడైనా,కళాశాల,పాఠశాలలలో ఎవ రైనా యువత మాదక ద్రవ్యాలకు అలవాటుపడినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1972కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలు గ్యోప్యంగా ఉం చుతామన్నారు.ఈ విషయంలో ఎవరికీ భయపడవలసిన అవసరం లేదని తెలిపారు.స మాచారం అందించిన వారికి రివార్డులు కూడా అందజేస్తామని అన్నారు.ఎక్కడైనా డ్రగ్స్ కలిగి ఉన్నా,సరఫరా చేస్తున్నా,సేవించిన వారిపై ఎన్ డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసులు న మోదు చేసి చర్యలుంటాయన్నారు.ఆరు నెలల వరకు బెయిల్ కూడా రాదన్నారు.యువ త డ్రగ్స్ మత్తులో పడితే దొంగతనాలు చేస్తారన్నారు.పెద్ద పెద్ద నేరాలు కూడా చేస్తారన్నా రు.డ్రగ్స్ అలవాటు పడిన వారికి రిహాబిలిటేషన్ సెంటర్ లో అన్ని సౌకర్యాలు కల్పించి కౌ న్సిలింగ్ చేసి వారిని మాదక ద్రవ్యాల వినియోగం నుండి బయటకు తీసుకుని వచ్చి ఆరో గ్యవంతులను చేస్తామని జిల్లా ఎస్పీ తెలియజేశారు.కేర్ కమిటీ సభ్యుడు రాజేంద్రప్రసా ద్, స్ఫూర్తి రిహాబిలిటేషన్ శివశంకర్,సైకియాట్రిస్ట్ డాక్టర్ చైతన్య కుమార్,విద్యార్థినులు జ యశ్రీ,సాహితీ, నయోమికలు మాదకద్రవ్యాల వినియోగం వాటి వలన జరిగే నష్టాల గు రించి వివరించారు.డ్రగ్స్ కు అలవాటుపడి,వ్యసనంగా మారిన వారికి కర్నూలు గవర్న మెంట్ హాస్పిటల్ లో ఓపి 30లో హెల్త్ పరంగా ట్రీట్ మెంట్ చేసి, కౌన్సిలింగ్ చేసి బాగు చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి,అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు,ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ క మిషనర్ రామకృష్ణారెడ్డి,ఈగల్ టీమ్ ఎస్ఐ సుజన్ కుమార్,ఇంచార్జి డిఆర్ఓ వెంకటేశ్వ ర్లు,కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఐసిడిఎస్ పిడి నిర్మల,మెప్మా పిడి నాగశివ లీల,డి ఎంహెచ్ఓ డా.శాంతి కళ,డిఈఓ శామ్యూల్ పాల్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...