ముగ్గురి ప్రాణాలు తీసిన కిలాడీ ముఠా...

ముగ్గురి ప్రాణాలు తీసిన కిలాడీ ముఠా

VS9TV న్యూస్,గుంటూరు క్రైం :

ఏపీలోని గుంటూరులో దారుణం చోటుచేసుకుంది.డబ్బు నగల కోసం ఓ ముఠా దారుణా లకు పాల్పడింది.మూడు హత్యలు చేసి...ఏం తెలియనట్లు నటిస్తున్న ముగ్గురికి పోలీసు లు కటకటాల వెనక్కి నెట్టారు...సీసీ ఫుటేజీ సహాయంతో ట్రిపుల్ మర్డర్ కేసులను చేధిం చారు.వివరాలు ఇలా ఉన్నాయి...తెనాలిలోని మారీస్ పేటకు చెందిన కుసుమకుమారి ఇంటికి సమీపంలోనే సుభాషిణి అనే డెభ్బై ఏళ్ల వృద్దురాలు నివసించేది.ఆమె పిల్లలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు.ఈక్రమంలో తమ తల్లి బాగోగులు చూసుకోమని కుసుమ కుమా రికి చెప్పారు.అయితే కుసుమ కుమారికి సుభాషిణి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నుపడింది.మే, 25వ తేదీన తనకు తెలిసిన ఆటో డ్రైవర్ గోపిక్రిష్ణను సుభాషిణి ఇంటికి రమ్మని కుసుమ కుమారి చెప్పింది.గోపిక్రిష్ణ గోడ దూకి సుభాషిణి ఇంటిలోకి వెళ్లాడు. అ ప్పటికే అక్కడే ఉన్న కుసుమకుమారి గోపిక్రిష్ణ సాయంతో సుభాషిణిని గొంతు నులిమి చంపేసి ఆమె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయారు.కొద్దీసేపటి తర్వాత సుభాషిణి కుమార్తె ఫోన్ చేయగా ఆమె తీయలేదు.దీంతో అనుమానం వచ్చిన కు మార్తె...కుసుమ కుమారికి ఫోన్ చేసి ఏం జరిగిందో చూడాలని చెప్పింది.దీంతో కుసు మకుమారి తన ఇంటి పక్కల వారిని తీసుకొని సుభాషిణి ఇంటికి వెళ్లింది. అయితే,ఆమె చనిపోయి ఉండటంతో ఈ విషయాన్ని కుమార్తెకు చెప్పింది.ముఖంపై గాయాలుండటం ,బంగారు ఆభరణాలు మాయం కావడంతో అనుమానం వచ్చింది.అయితే...కేసులు,గొడ వలు ఎందుకులే అని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.బంగారు ఆభరణాలను తాకట్టు పె ట్టి వచ్చిన నగలను వారు పంచుకున్నారు.ఈ కేసు బయటకు రాకపోవడంతో కుసుమ కు మారి గ్యాంగ్ మరోకరి హత్యకు ప్లాన్ వేశారు.అక్కడికి సమీపంలో ఉన్న ఒంటరి మహిళ ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు.అయితే ఆ ఇంటికి నలువైపులా సిసి కెమెరాలు ఉండటం తో హత్య ప్లాన్‌ను విరమించుకున్నారు.ఆ తర్వాత కుసుమకుమారి తనకు పరిచయం ఉ న్న రాజేశ్వరి,అంజమ్మలపై కన్నేసింది.వారి ఇంటిపై గది ఖాళీగా ఉండటంతో ఆ గది అద్దె కు తీసుకునే పేరుతో వారి ఇంటి వద్దకు వెళ్లి వారిని చంపే విధంగా ప్లాన్ వేసింది.ఇందు కోసం ఈనెల 18వ తేదిన రాజేశ్వరి ఇంటి వద్దకు వెళ్లారు.అయితే జనసంచారం అధి కంగా ఉండటంతో వెనుదిరిగివచ్చారు.మరొసటి రోజు మరొసారి రాజేశ్వరి ఇంటికి వెళ్లా రు.ఆమెపై అంతస్థులోకి వెళ్లి గది చూపించిన తర్వాత...గోపిక్రిష్ణ,కుసుమ కుమారి మరొ క మైనర్ బాలుడితో కలిసి ఆమెను హత్య చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయారు.అయితే రాజేశ్వరి ఇంటిలో సిసి కెమెరాలున్న విషయాన్ని నిం దితులు పసిగట్టలేకపోయారు.అదే సమయంలో సిసి కెమెరాలను వారి కుమార్తె తన ఫో న్ కు అనుసంధానం చేసుకోవడంతో ఎవరూ ముగ్గురు వచ్చి వెళ్లినట్లు వారి కుమార్తె పోలీ సులకు చెప్పింది.సిసి కెమెరా విజువల్స్ సాయంతో ముగ్గురి గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.సిసి కెమెరా విజువల్స్ లేకుంటే ఎంతోమంది ప్రాణాలను ముఠా హ రించేదని స్థానికులు చెపుతున్నారు.కుసుమకుమారి,గోపిక్రిష్ణలతో పాటు మరొక మైనర్ బాలుడు కూడా ఈ హత్యల్లో భాగస్వామ్యం కావడం కలకలం రేపింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...