గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియ ని వ్యక్తి మృతి.... ఎస్.మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ...
గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఎస్.మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్, బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళు రోడ్డులో గుత్తి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ముగింపు వద్ద,రామచంద్ర నగర్ లోని వెల్కమ్ సూపర్ మార్కెట్ ప్రాం తంలో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీ కొన్నట్లు ట్రాఫిక్ సిఐ ఎస్.మన్సూరుద్దిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సిఐ తెలిపిన వివరాలు...ప్రమాదానికి గురైన వ్యక్తి తలకు బల మైన రక్తగాయాలు కలిగి రోడ్డుపై పడి ఉన్నాడు.సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీ సులు గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ జనర ల్ హాస్పిటల్ కు తరలించిన్నట్లు చెప్పారు.చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మార్చురీ రూముకు తరలించినట్లు సిఐ తెలిపారు.
మృతుడి ఆనవాళ్లు :
గుర్తుతెలియని మగ వ్యక్తి
వయసు : సుమారుగా (40) సం..లు,
ఎత్తు : సుమారుగా 5.03 అడుగులు
వెంట్రుకలు : సుమారుగా 02 ఇంచులు నలుపు,
వర్ణము : చామన చాయ
దుస్తులు : నలుపు మరియు తెలుపు చారల షర్టు,నల్లటి జీన్స్ ప్యాంటు, నడుముకు నల్లటి మొలతాడు,కుడి చేతికి స్టీలు కడియం
మచ్చలు :
1) కుడి మోచేతి కింద పచ్చబొట్టు, హిందీలో అమ్రేష్ పాల్ అని రాసి ఉంది.
2) కుడి మోచేతి కింద ఒక నల్లటి పుట్టుమచ్చ.
పై తెలుపబడిన మృతుడుని గుర్తించిన ఎడల కర్నూలు ట్రాఫిక్ సిఐ ఎస్.మన్సూరుద్దిన్ సెల్ ఫోన్ 9121101078 కు తెలుపగలరు.
Comments
Post a Comment