దొరికిన వజ్రంను ప్రసిద్ధ ఆంజనేయస్వామికి అప్పగించిన ఆకాశరామన్న భక్తుడు...

దొరికిన వజ్రంను ప్రసిద్ధ ఆంజనేయస్వామికి అప్పగించిన
ఆకాశరామన్న భక్తుడు

VS9TV న్యూస్,రాజంపేట :

అన్నమయ్య జిల్లా,రాజంపేట పట్ట ణంలోని ప్రసిద్ధ ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కా ర్యక్రమాన్ని దేవాదాయ శాఖ అ ధికారులు నిర్వహించారు.ఈ కా ర్యక్రమంలో ఆలయ హుండీ నుం చి 1.39.6క్యారెట్ల ముడి వజ్రం బయటపడింది.అంతేకాకుండా వ జ్రంతో పాటు ఒక ఉత్తరం కూడా లభించింది.ఆ ఉత్తరంలో దాత తనకు ఈ వజ్రం దొరికిందని,అది నిజమైనదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే స్వామి వారికి సమర్పిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు,ఈ వజ్రాన్ని స్వామివారి అలంకరణ, ఆభరణాల తయారీకి వినియోగించాలని కోరారు.ఈ సమాచారం అందుకున్న దేవాదా య శాఖ తనిఖీ అధికారి జనార్దన్,కార్య నిర్వహణాధికారి కొండారెడ్డిల సమక్షంలో వజ్రా న్ని ఆలయ ప్రధాన అర్చకుడు రవిస్వామి వద్దకు అప్పగించారు.ఈ సందర్భంగా అధికారులు దాత చేసిన ఆత్మీయ సమర్పణను ప్రశంసించారు. హుండీ లెక్కింపు పూర్తయిన అనంత రం ఈ వివరాలను అధికారికంగా ధృవీకరిం చారు.ఆలయానికి ఈ రకమైన సమర్పణలు స్వామివారి పట్ల భక్తుల విశ్వాసానికి దృఢత చేకూరుస్తున్నాయని దేవాదాయ శాఖ అధి కారులు వ్యాఖ్యానించారు.కాగా 1.39.6క్యారెట్ల ముడి వజ్రం విలువ..దాని నాణ్యత ఆ ధారంగా,సుమారు రూ.70లక్షలు నుండి రూ.2 కోట్లు ఉండే అవకాశం ఉందని వజ్రాల వ్యాపారులు చెబుతున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...