వాణిజ్యేతర వాహనదారులకు కేంద్రం శుభవార్త...మూడు వేలకు వార్షిక టోల్‌పాస్‌...

వాణిజ్యేతర వాహనదారులకు కేంద్రం శుభవార్త
మూడు వేలకు వార్షిక టోల్‌పాస్‌
హైవేలపై 200 ట్రిప్పులు
ఒక్కో టోల్‌గేట్‌ ఒక్కో ట్రిప్పు
ఆగస్టు,15 నుంచి అమల్లోకి

VS9TV న్యూస్,న్యూడిల్లీ : 

జాతీయ రహదారులు(ఎన్‌హెచ్‌),జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే(ఎన్‌ఈ)లపై ప్రయాణించే వాణిజ్యే తర ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.వీరి కోసం ఆగస్టు, 15 నుంచి మూడు వేల వార్షిక ఫాస్టాగ్‌ టోల్‌పాస్‌ విధానాన్ని ప్రవేశపెడుతోంది.దీనికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.మూడు వేలతో ఫాస్టాగ్‌ టోల్‌పాస్‌ తీ సుకునే కార్లు,జీపులు,వ్యాన్ల యజమానులు ఏడాదిపాటుగానీ,200ట్రిప్పుల వరకుగానీ జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు.కొత్త విధానం వ్యక్తిగత కార్లు, జీపులు,వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది.వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు.200ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ మూడు వేలతో యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.ఇలా ఏడాదిలో ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు.ఇప్పటికే ఫాస్టాగ్‌ ఉన్నవారు మళ్లీ కొత్త ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.పాత ఫాస్టాగ్‌లోనే టోల్‌పాస్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.ఒక్కో టోల్‌ గేట్‌ ను ఒక్కో ట్రిప్పుగా లెక్కిస్తారు.హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లేవారు నాలుగు టో ల్‌గేట్లను దాటాల్సి ఉంటుంది.అంటే వారు నాలుగు ట్రిప్పులను పూర్తి చేసినట్లుగా లెక్కి స్తారు.తిరిగి వస్తే మరో నాలుగు ట్రిప్పులుగా లెక్కిస్తారు.అంటే హైదరాబాద్‌ నుంచి విజయ వాడ వెళ్లి రావడానికి ఎనిమిది ట్రిప్పులు అవుతాయి.ఈ పాస్‌లను ఛాసిస్‌ నంబరు ఆధా రంగా కాకుండా...వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు ద్వారానే జారీ చేస్తారు.వార్షిక పాస్‌ తీసు కోవడం తప్పనిసరేమీ కాదు.తక్కువ ట్రిప్పులు తిరిగేవారు,ఒకేసారి మూడు వేలు చెల్లించ డానికి ఇష్టపడనివారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్‌ విధానాన్ని కొనసాగిస్తూ టోల్‌ గేట్లలో వసూలు చేసే ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.దేశవ్యాప్తంగా 1,063 టోల్‌ప్లాజాలు న్నాయి.వాటి సంఖ్య ఏపీలో 72గా,తెలంగాణలో 36గా ఉంది. 2024,డిసెంబరు,1 నా టికి దేశంలో 10.1 కోట్ల ఫాస్టాగ్‌లను వాహనదారులు తీసుకున్నారు.ఫాస్టాగ్‌ల ద్వారా జాతీయ రహదారులపై రోజుకు సగటున రూ.200 కోట్ల ఆదాయం వస్తోంది.టోల్‌ ప్లా జాల ద్వారా వెళ్లే వాహనాల్లో 53శాతం కార్లు, జీపులు,వ్యాన్లు ఉంటున్నాయి.సగటున ఏ డు వేల లాభం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తక్కువ ఖర్చుతో రాకపోకలు సా గించడానికి వార్షిక టోల్‌పాస్‌ ఉపయోగపడుతుందని రోడ్డు రవాణా,జాతీయ రహదా రులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.కొత్త పాస్‌ల యాక్టివేషన్,రెన్యువల్‌ కోసం రాజ్‌ మార్గ్‌యాత్ర యాప్,ఎన్‌హెచ్‌ఏఐ, ఎంవోఆర్‌టీహెచ్‌ వెబ్‌సైట్లలో ప్రత్యేక లింక్‌లను త్వర లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వారు విడుదల చేసిన ప్రకటనలో ఆయన వెల్లడిం చారు.''60 కిలోమీటర్లలోపే రెండు టోల్‌ప్లాజాలు ఉన్నచోట్ల చాలాకాలంగా ఎదురవు తున్న సమస్యలను కొత్త పాస్‌ విధానం పరిష్కరిస్తుంది.వార్షిక టోల్‌పాస్‌లతో వాహనదా రులకు సగటున ఏడు వేల ప్రయోజనం కలుగుతుంది.ప్రస్తుతం ఒక్కో టోల్‌గేట్‌వద్ద రూ.50 నుంచి రూ.100కుపైగా టోల్‌ ఫీజు వసూలు చేస్తున్నారు.వార్షిక పాస్‌తో ఒక్కో టోల్‌గేట్‌ దాటడానికి సగటున రూ.15 ఖర్చవుతుంది.ఇప్పుడున్న విధానం ప్రకారం...ఒ క్కో గేట్‌వద్ద సగటున కనీసం రూ.50చెల్లిస్తారనుకుంటే...200గేట్లు దాటడానికి రూ. 10వేలు చెల్లించాల్సి ఉంటుంది.వార్షిక పాస్‌తో ఇది మూడు వేలకు తగ్గుతుంది.దీనివల్ల వాహనదారులకు ఏటా సగటున ఏడు వేల ప్రయోజనం చేకూరుతుంది.రాష్ట్ర రహదారు లకు ఇది వర్తించదు.రాష్ట్ర ప్రభుత్వాలు,స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చే ఎక్స్‌ప్రెస్‌వేలు,స్టేట్‌ హైవేల్లో ఈ వార్షిక ఫాస్టాగ్‌ సాధారణ ఫాస్టాగ్‌లా పని చేస్తుంది.ఆ ప్లాజాలో వసూలుచేసే సాధారణ మొత్తాన్ని అక్కడ చెల్లించాల్సి ఉంటుంది'' అని వివరించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....